ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్మశాన వాటికకు స్థలం కేటాయించండి

ABN, First Publish Date - 2022-12-16T23:39:47+05:30

జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు గ్రామ పంచాయతీలో రాజీవ్‌నగర్‌ కాలనీవాసులకు శ్మశానవాటికకు మరింత స్థలం కేటాయించాలని శుక్రవారం ఉదయం స్థానిక సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ తులసికి గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజీవ్‌నగర్‌ కాలనీ వాసులు

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 16: జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు గ్రామ పంచాయతీలో రాజీవ్‌నగర్‌ కాలనీవాసులకు శ్మశానవాటికకు మరింత స్థలం కేటాయించాలని శుక్రవారం ఉదయం స్థానిక సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ తులసికి గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజీవ్‌నగర్‌ కాలనీవాసులు మాట్లాడుతూ రాజీవ్‌నగర్‌ కాలనీ మూడు సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. సిమెంటు రోడ్లు లేక గుంతల రోడ్డులో అవస్థలు పడుతున్నామన్నారు. అలాగే రాజీవ్‌నగర్‌ కాలనీవాసులకు శ్మశాన వాటికకు గతంలో ఎనిమిది సెంట్ల స్థలాన్ని మాత్రమే కేటాయించారన్నారు. రెండు వేల ఇళ్లకు పైగా నివాసాలు ఉంటే ఆ స్థలం సరిపోవడంలేదన్నారు. శ్మశాన వాటికకు రహదారి సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. నీటిపారుదల వలన కంపచెట్లు విపరీతంగా పెరిగాయన్నారు. శ్మశాన వాటికకు స్థలం కేటాయింపుతోపాటు అక్కడ ఒక మంచినీటి కుళాయిని ఏర్పాటు చేయాలని ఆ కాలనీవాసులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు భాస్కర్‌, ఆంజనేయులు, వీరభద్ర, రఘునాథ, కఠిక నరసింహ, రంగనాయకులు, నారాయణ, నాగేంద్ర, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:39:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising