ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయండి

ABN, First Publish Date - 2022-05-29T05:08:23+05:30

ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ అమలుకు ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి కోరారు.

మాట్లాడుతున్న నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటి టౌన్‌, మే 28:  ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ అమలుకు ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రధానోపాధ్యాయ సంఘం కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల కౌన్సిల్‌ సమావేశం శనివారం రాయచోటిలోని డైట్‌ విద్యా కేంద్రంలో శనివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిఽథిగా విచ్చేసిన నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాల విద్యలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఉపాధ్యాయు లకు ఉమ్మడి సర్వీసులు నిబందనలు లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనమైనందున ఎస్‌జీటీలను స్కూల్‌ అసిస్టెంట్లుగా, ప్రధానోపాధ్యాయులను సీబీఎ్‌సఈ పాఠశాలలుగా అప్‌డేట్‌ అయిన ఉన్నత పాఠశాలలకు ప్రిన్సిపాల్స్‌గా పదోన్నతులు ఇచ్చేందుకు షెడ్యూల్‌ ప్రకటించాలన్నారు. అప్‌డేట్‌ అయిన ఉన్నత పాఠశాలలకు వెంటనే ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలన్నారు. అనేక పాఠశాలల్లో బోధనేతర సిబ్బంది లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల సం ఘం కడప జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి కేఎల్‌ నరసింహశాస్త్రి, కోశాధికారి రాజశేఖర్‌,  ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T05:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising