మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఒకరి అరెస్టు
ABN, First Publish Date - 2022-03-06T04:53:24+05:30
మండలంలోని జాతీయ రహదారి పై ఒకరిని అదుపులోకి తీసుకొని 9 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
గోపవరం, మార్చి 5 : మండలంలోని జాతీయ రహదారి పై ఒకరిని అదుపులోకి తీసుకొని 9 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం అనంతరాజుపురం చెందిన అబ్బోరి నరసింహులు అనే వ్యక్తి మూడు ఫుల్ బాటిళ్లు, 6 క్వార్టర్ మద్యం బాటిళ్లతో వెళుతుండగా అదుపులోకి తీసుకొని వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
స్థలం కోసం ఘర్షణ ... ముగ్గురికి గాయాలు
పోరుమామిళ్ల, మార్చి 5 మండలంలోని రంగసముద్రం పంచాయతీ ఎస్టీకాలనీలో స్థలం కోసం జరిగిన ఘర్షణలో మల్లెదీప అనే గర్భిణీతోపాటు మస్తాన్, మల్లిఖార్జునకు గాయాల య్యా యి. వారిని పోరుమామిళ్ల ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి అనంతరం మల్లె దీప, మస్తాన్‌లను కడపకు తరలించారు.
ఏటీఎం చోరీకి యత్నం
ఖాజీపేట, మార్చి 5: మండల పరిధిలోని సర్వఖాన్‌పేట దారిలో ఉన్న ఓ ప్రైవేటు ఏటీఎంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగలు చోరీకి యత్నం చేశారు. ఇనుపరాడ్‌తో ఏటీఎంను ధ్వంసం చేసే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. విషయం తెలుసుకుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఇనుపరాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2022-03-06T04:53:24+05:30 IST