పోలీసుల అండతో సాగుతున్న పాలన
ABN, First Publish Date - 2022-12-07T23:34:33+05:30
ప్రజలను మోసపుచ్చుతూ, పోలీసుల అండతో ఎంతోకాలం పాలన సాగించలే రని, రాజ్యంగ హక్కును కాలరాస్తూ పాదయాత్రకు ముందస్తు అనుమతి కో రినా అనుమతి ఇవ్వకపోవడం పౌరహక్కులకు భంగం కలిగించడమేనని సీపీ ఐ నేతలు పోలీసులకు తెలియపరిచారు. జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోరు తూ సీపీఐ నేతలు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ విషయమై అనుమతి ఇవ్వాలంటూ బుధవారం సాయంత్రం జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయం గేటు ఎదురుగా సీపీఐ నేతలు బైఠాయించారు.
పాదయాత్రకు అనుమతి కోరుతూ బైఠాయింపు
మూడేళ్లగా ఉక్కు ఏర్పాటును పట్టించుకోని సీఎం
సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర
జమ్మలమడుగు రూరల్, డిసెంబరు 7: ప్రజలను మోసపుచ్చుతూ, పోలీసుల అండతో ఎంతోకాలం పాలన సాగించలే రని, రాజ్యంగ హక్కును కాలరాస్తూ పాదయాత్రకు ముందస్తు అనుమతి కో రినా అనుమతి ఇవ్వకపోవడం పౌరహక్కులకు భంగం కలిగించడమేనని సీపీ ఐ నేతలు పోలీసులకు తెలియపరిచారు. జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోరు తూ సీపీఐ నేతలు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ విషయమై అనుమతి ఇవ్వాలంటూ బుధవారం సాయంత్రం జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయం గేటు ఎదురుగా సీపీఐ నేతలు బైఠాయించారు. ప్రధాన రోడ్డుకు పక్కన ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలిగించకుండా డీఎస్పీ కార్యాలయం గేటు కు దగ్గరలో నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి జిల్లా అధికార యంత్రాంగం ఉక్కు పాదయాత్రకు అనుమతి ఎందుకు ఇవ్వరో చెప్పాలన్నారు. జిల్లాలోని సీపీఐ నేతలు కడపలో ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరామన్నారు. జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయంలో వెళ్లి అడగాలని ఎస్పీ చెప్పడంతో ఈనెల రెండో తేదీ జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయంలో స్థానిక కార్యదర్శి ప్రసాద్ అనుమతి కోరారన్నారు.
తర్వాత 5వ తేదీ అనుమతి కోసం రిజిస్టర్ పోస్టు చేశామన్నారు. 6వ తేదీ వెళితే 7వ తేదీ రమ్మని డీఎస్పీ చెప్పారన్నారు. 7వ తేదీ సా యంత్రం బుధవారం తమ నేతలంతా కలిసి జమ్మలమడుగు డీఎస్పీ వద్దకు వెళితే ఆయన వద్ద పనిచేస్తున్న ఒక సిబ్బంది పాదయాత్రకు అనుమతి ఇచ్చేది లేదని డీఎస్పీ చెప్పారని చెప్పినట్లు తెలిపారు. దీంతో చేసేది లేక వెంటనే కార్యాలయం ఎదుట ఉక్కు పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, ఎందుకు ఇవ్వరో చెప్పాలని కోరుతూ బైఠాయించా రు. ఉక్కు పరిశ్రమ సాధనకోసం సీపీఐ తలపెట్టి న పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, పౌరహక్కులకు భం గం కలిగించడమేనని, ఇది పోలీసుల రాజ్యం కాద ని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి మం డిపడ్డారు.
కడప ఉక్కు పరిశ్రమ సాధనకోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నేతృత్వంలో పాదయాత్ర 9వ తేదీ కన్నెతీర్థం నుంచి ప్రారంభమవుతుందని ఈ పాదయాత్రకు అనుమతి కోరు తూ జిల్లా, డివిజన్ స్థాయి అధికారులకు రాతపూర్వకంగా విన్నవించుకున్నా అనుమతి ఇవ్వకపోవ డం దారుణమన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసనలు, ప్రదర్శనలు చేపట్టే హక్కు రా జ్యాగం కల్పించిందని, ఈ హక్కును కాలరాయడం రాష్ట్ర ప్రభుత్వానికే సిగ్గుచేటన్నారు. ఇది పోలీసుల, సైనికరాజ్యం కాదని, ప్రజాస్వామ్యమని పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఎక్కువ రోజులు పాలన సాగించేది లేదని వారు తేల్చిచెప్పారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమకోసం ఇప్పటి వరకు ముగ్గు రు ముఖ్యమంత్రులు శిలాఫలకాలు వే శారన్నారు.
ఇప్పటికి పునాది రాళ్లేనని, ఒక్కరూ నిర్మాణ చర్యలు చేపట్టలేదన్నారు. 2019 డిసెంబరు 23న సున్నపురాళ్లపల్లె వద్ద ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పునాది రాయి వేసి మూ డేళ్లవు తున్నా ముఖ్యమంత్రి ఆ పరిశ్రమను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం కానీ, గట్టిగా నిలదీయడం కానీ చేయ లేదన్నారు. కేవలం ఆయన కేసులకు సంబంధించి ఢిల్లీకి తిరగడమేనన్నారు. బీజేపీ చేతిలో సీఎం జగన్ కీలుబొమ్మ అయ్యారని వైసీపీ పాలనలో రాష్ట్రానికి చేసిన మే లు ఏమీలేదన్నారు. ఎక్కడా ఒక పరిశ్రమ ఏర్పా టు చేసి ఉద్యోగాలు భర్తీ చేసిన దాఖలాలు లేవన్నారు.
కర్నూలులో హైకోర్టు పెడదామంటే ఎవ రూ వద్దనలేదని, కావాలనే సీమ గర్జన పేరుతో ప్రజలను ఇంకా మోసం చేసేందుకు సీఎం ప్రయ త్నం చేస్తున్నారన్నారు. ఆర్టీఓ, పోలీసులను అడ్డం పెట్టుకుని పాఠశాల, కళాశాలల బస్సులతో కర్నూలుకు జనాన్ని తరలించవచ్చు కానీ ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుతంగా పాదయాత్ర చేయడం తప్పా, నేరమా అని పోలీసుల వ్యవహారం సరికా దన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగసుబ్బారెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి సుబ్బారెడ్డి, రామయ్య, వీరశేఖర్, చంద్రశేఖర్, శ్రీరాములు, సుబ్రహ్మణ్యం, బా దుల్లా, సురేష్, జిల్లా కమి టీ సభ్యులు ప్రసాద్, బా లు, జకరయ్య, ఈశ్వరయ్య, చాంద్‌బా, రాజు, ఏఐఎ్‌సఎఫ్ జిల్లా కార్యదర్శి రాజు, అధ్యక్షులు పవన్, లోకేష్, మరికొందరు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:34:35+05:30 IST