ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలి

ABN, First Publish Date - 2022-07-03T04:49:36+05:30

రెండున్నర నెలల్లోనే రెండు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం మో యలేని భారం మోపుతోందని అన్నమయ్య జిల్లా సీపీ ఐ కార్యదర్శి పీఎల్‌ నరసిం హులు ఆరోపించారు.

రాయచోటి ఆర్టీసీ బస్టాండులో ధర్నా చేస్తున్న సీపీఐ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన్‌, జూలె ౖ2: రెండున్నర నెలల్లోనే రెండు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం మో యలేని భారం మోపుతోందని  అన్నమయ్య జిల్లా సీపీ ఐ కార్యదర్శి పీఎల్‌ నరసిం హులు ఆరోపించారు. శనివారం రాయచోటి ఆర్టీసీ బస్టాండు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు  ఎలాంటి ధరలు పెంచనని చెప్పిన జగన్‌మోహన్‌ రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రజలు నడ్డివిరిచే కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, మనోహర్‌రెడ్డి, రా యచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు, రాజంపేట నియోజక వర్గ కార్యదర్శి మహేష్‌, మదనపల్లె నియో జకవర్గ కార్యదర్శి సాంబశివ, కోడూరు నియోజకవర్గ కార్యదర్శి రాధాకృష్ణ, గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు విశ్వనాధ్‌నాయక్‌, ఏపీ రైతు సంఘం నాయ కులు జతిన్‌, రంగారెడ్డి, సీనియర్‌ నాయకుడు వెంకటేష్‌, సురేష్‌కుమార్‌ తదిరతులు పాల్గొన్నారు. 

చార్జీలపెంపుతో ప్రజలపై మరింత భారం 

పెనగలూరు: ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై మరింత భారం మోపడం వైసీపీ ప్రభుత్వానికి తగదని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. శనివారం సిద ్దవటం మండలంలోని ఉప్పర పల్లెలో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడు తూ  ఇటీవల డీజిల్‌ ధరల పెంపు సాకుతో రూ.720 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన జగన్‌మోహన్‌రెడ్డి, మరోసారి డీజిల్‌సెస్‌ పేరుతో ఆర్టీసీ చార్జీలను పెంచడం  దారుణమన్నారు. స్కూల్‌ పిల్లల బస్సుపాసులు ధరలు కూడా పెం చారన్నారు. అడుగడుగునా వైసీపీ ప్రభుత్వం తిరోగమనవిధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 


Updated Date - 2022-07-03T04:49:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising