ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రహ్మంగారిమఠంలో బియ్యం వివాదం

ABN, First Publish Date - 2022-01-28T04:51:53+05:30

బ్రహ్మంగారిమఠంలో బియ్యం వివాదం చర్చనీయాంశమైంది.

ఆటోలో తరలిస్తున్న బియ్యం బస్తాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రహ్మంగారిమఠం రూరల్‌, జనవరి 27: బ్రహ్మంగారిమఠంలో బియ్యం వివాదం చర్చనీయాంశమైంది. ఆల య ప్రాంగణంలోని మఠాధిపతి నివాస గృహం, ప్రసాదశాల నుంచి బుధవారం రాత్రి బియ్యం బస్తాలు తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ విషయంపై దేవస్థానం పరిపాలనాధికారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఫిట్‌పర్సన్‌) శంకర్‌బాలాజీని గ్రామస్థులు ఫోన్‌లో తెలపగా ఆ విషయం తనకు తెలియదని, తాను ఎవరికీ అనుమతి ఇవ్వలేదని చెప్పారు. వెంటనే పరిపాలనాధికారి శంకర్‌బాలాజీ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆటోలో పది బస్తాలకు పైగా ఉన్న బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఆలయ ప్రాంగణంలోకి ఫిట్‌పర్సన్‌ రావడంతో బియ్యాన్ని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన మఠాధిపతి శివైక్యం చెంది తొమ్మిది నెలలు కావస్తోందని, ఈ సందర్భంగా ఆశ్రమం వృద్ధులకు అన్నదానం చేసేందుకు తరలిస్తున్నా మని మండలంలోని బాలమ్మ వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదానం చేపట్టేందుకు మాత్రమే బియ్యాన్ని తరలిద్దామనుకున్నామని, మరే ఉద్దేశం లేదని దివంగత మఠాధిపతి సతీమణి మారుతీ మహాలక్షుమ్మ విలేకరులకు తెలిపారు. 

Updated Date - 2022-01-28T04:51:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising