ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

ABN, First Publish Date - 2022-01-25T04:31:18+05:30

జమ్మలమడుగు పట్టణంలో 5వ వార్డులో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి స్థానికులు విజ్ఞప్తి చేశారు.

సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 24: జమ్మలమడుగు పట్టణంలో 5వ వార్డులో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి స్థానికులు విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇంటింటి కార్యక్రమంలో భాగంగా వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు బాధితులు సమస్యలు వివరించారు. వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని, సిమెంటు రోడ్లు వేయాలని, కాలువలు శుభ్రం చేయాలని తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ప్రజలకు ఇబ్బంది కలిగించరాదని తెలిపారు. హౌసింగ్‌లో బిల్లులు ఇప్పించాలని కొందరు కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వేల్పుల శివమ్మ, పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌-2 సింగరయ్య, డీటీ వేణు, మున్సిపాలిటీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T04:31:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising