ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా విడుదల

ABN, First Publish Date - 2022-12-31T00:09:07+05:30

పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు 2023కు సంబంధించి తుది ఓటర్ల జాబితాను అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి శుక్రవారం విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టభద్రుల ఓట్లు 3,28,807

ఉపాధ్యాయుల ఓట్లు 27,716

కడప (ఎడ్యుకేషన్‌), డిసెంబరు 30 : పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు 2023కు సంబంధించి తుది ఓటర్ల జాబితాను అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి శుక్రవారం విడుదల చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు 3,28,807 ఓట్లు ఉండగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 27,716 ఓట్లు జాబితాలో ఉన్నట్లు తెలిపారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు

కర్నూలు జిల్లాకు సంబంధించి 42,097 మంది పురుషులు 19,586 స్ర్తీలు, థర్డ్‌ జెండర్‌ 1, మొత్తం 61వేల 684 ఓట్లు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో పురుషులు 38,607, స్ర్తీలు 16,192, థర్డ్‌ జెండర్‌ 4 మొత్తం 54,803 ఓట్లు ఉన్నాయి. అలాగే అనంతపురం జిల్లాలో పురుషులు 45,251, స్ర్తీలు 22,404, థర్డ్‌ జెండర్‌ 10, మొత్తం 67,665 ఓట్లు. సత్యసాయిజిల్లాలో పురుషులు 29,474, స్ర్తీలు 13,529, థర్డ్‌ జెండర్‌ 4, మొత్తం 43,007, వైఎ్‌సఆర్‌ కడప జిల్లాలో పురుషులు 52,189, స్ర్తీలు 28,990, థర్డ్‌ జెండర్‌ 8 మొత్తం 81,187, అన్నమయ్య పురుషులు 13,940 స్ర్తీలు 6,515, ఽథర్డ్‌ జెండర్‌ 6 మొత్తం 20,461 ఓట్లు ఉన్నాయి. మొత్తం పట్టభద్రుల ఓట్లకు సంబంధించి పురుషులు 2,21,558, స్ర్తీలు 1,07,216, థర్డ్‌ జెండర్‌ 33.. అన్నీ కలిపి 3,28,807 ఓటర్లున్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలు

కర్నూలు జిల్లాలో పురుషులు 2,983, స్ర్తీలు 2,381 మొత్తం 5,364 మంది ఓటర్లున్నారు. నంద్యాలలో పురుషులు 2,785, స్ర్తీలు 1,616, థర్డ్‌ జెండర్‌ 1, మొత్తం 4402 మంది, అనంతపురంలో పురుషులు 3,404, స్ర్తీలు 2,055, ఽథర్డ్‌ జెండర్‌ 2, మొత్తం 5,461 మంది, సత్యసాయి జిల్లాలో పురుషులు 2,194, స్ర్తీలు 1,005, మొత్తం 3,199మంది ఓటర్లున్నారు. అలాగే వైఎ్‌సఆర్‌ కడప జిల్లాలో పురుషులు 4,344, స్ర్తీలు 3,013, థర్డ్‌జెండర్‌ 1 మొత్తం 7,358 మంది, అన్నమయ్య జిల్లాలో పురుషులు 1,313, స్ర్తీలు 619 మొత్తం 1,932 మంది ఓటర్లున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి మొత్తం పురుషులు 17,023, స్ర్తీలు 10,689, థర్డ్‌ జెండర్‌ 4 కలిపి మొత్తం 27,716 ఓట్లు ఉన్నాయి.

Updated Date - 2022-12-31T00:09:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising