ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగుకు సమాయత్తం

ABN, First Publish Date - 2022-05-23T05:43:19+05:30

ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల వల్ల సాగు చేసిన పంట చేతికందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆరుగాలం కష్టించి పంట సాగు చేస్తే తీరా చేతికందే సమయంలో అకాల వర్షాలు కురిసి పంట చేతికందక రైతుకు కన్నీరే మిగులుతోంది. గతంలో నష్టాలపాలైన రైతన్నలు ఈ సారైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సన్నద్ధమవుతున్నారు.

కాడెద్దులతో భూమిలో సేద్యం చేస్తున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుక్కులు దున్నుతున్న రైతన్నలు

ఈ సారైనా గట్టెక్కేనా

ఆందోళనలో అన్నదాతలు


కాడి పట్టి.. మేడి పట్టి.. చెర్నాకోల చేతపట్టి.. ఆరుగాలం కష్టించిన రైతన్నకు చివరకు నిరాశే మిగులుతోంది. రాత్రింబవళ్లు కంటిమీద కునుకు లేకుండా చమటోడ్చి సాగు చేసిన పంట చేతికొచ్చినంత వరకు నమ్మకం లేకుండా పోయింది.  ప్రకృతి ఎప్పుడేం చేస్తుందో.. పంట చేతికొచ్చినా సరైన ధరలు ఉంటాయో లేదో అని అన్నదాత మదనపడుతూనే ఉంటాడు. గతంలో అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల సాగుచేసిన పంటలు చేతికందక రైతుకు కన్నీరు మిగిల్చింది. ఈసారైనా పంట చేతికందకపోతుందా అనే ఆశతో అన్నదాత దుక్కులు దున్నుతున్నాడు. 


లక్కిరెడ్డిపల్లె, మే 22: ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల వల్ల సాగు చేసిన పంట చేతికందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆరుగాలం కష్టించి పంట సాగు చేస్తే తీరా చేతికందే సమయంలో అకాల వర్షాలు కురిసి పంట చేతికందక రైతుకు కన్నీరే మిగులుతోంది. గతంలో నష్టాలపాలైన రైతన్నలు ఈ సారైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే మండలంలో ఓ మోస్తారు వర్షం కురవడంతో సేంద్రియ ఎరువులు పొలాలకు తోలి ఎరువులు చల్లి జోరుగా సేద్యాలు చేస్తున్నారు. మండలంలో ప్రతి ఏటా 5140 ఎకరాల్లో వేరుశనగ పంట, వెయ్యి ఎకరాల్లో కంది పంట ఇతర పంటలు సాగు చేసేవారు. ఈ సారి అదే బాటలో పయనిస్తున్నారు. అయితే ట్రాక్టర్లు, కాడెద్దులు దొరకక చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మొన్న కురిసిన వర్షానికి పదును పోతుందనే ఆందోళనతో అడిగినంత ఇచ్చి ట్రాక్టర్‌తో సేద్యాలు చేయిస్తున్నారు. మండలంలో ఇప్పటికీ రైతు భరోసా కేంద్రాలకు వేరుశనగ విత్తనకాయలు చేరుకున్నాయి. మొత్తం మండలంలో 450 క్వింటళ్ల వేరుశనగ విత్తనకాయలు వచ్చాయని వ్యవసాయాధికారి సురేష్‌ తెలిపారు. ఏదేమైనా ప్రతి ఏటా రైతు అప్పులు చేసి విత్తనకాయలు, ఎరువులు కొనుగోలు చేసి పంటలు సాగు చేస్తే చివరికి మిగిలేది అప్పులే అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదైనా దేవుడు కరుణించి వారిని గట్టెక్కిస్తాడో లేదో వేచి చూడాలి.  


రూ.5 లక్షలు ఖర్చు పెడుతున్నా

నాకు ఉన్న 10 ఎకరాలకు ఏడాదికి దాదాపు రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నా. ప్రతి ఏటా వరదల వల్ల సాగు చేసిన పంటకు ఖర్చులు కూడా రావడం లేదు. ఈ ఏడాదైనా గట్టెక్కుతామే మోనని సేద్యం చేస్తున్నా. ఏమవుతుందో ఏమో.

-నాగిరెడ్డి, రైతు, బి.యర్రగుడి

Updated Date - 2022-05-23T05:43:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising