ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో పేదల బతుకు దుర్భరం!

ABN, First Publish Date - 2022-06-26T04:39:45+05:30

ధరలు, చార్జీల పెరుగుదలతో రాష్ట్రంలో పేదలబతుకు దుర్భరంగా మారిందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

చింతకాయపల్లెలో బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, జూన్‌ 25 : ధరలు, చార్జీల పెరుగుదలతో రాష్ట్రంలో పేదలబతుకు దుర్భరంగా మారిందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం  చేశారు. చింతకాయపల్లెలో  టీడీపీ బీసీ సెల్‌ పార్లమెంట్‌ కార్యనిర్వహక కార్యదర్శి చుక్కా యానాది ఆధ్వర్యంలో శనివారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు జంగంశెట్టి సుబ్బయ్య, మండల క్లస్టర్‌ ఇన్‌చార్జి పసుపులేటి ప్రవీణ్‌ మాట్లాడుతూ  జగన్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిత్యావసర సరుకులు నూనె, పప్పు, ఉప్పు, చింతపండు అన్ని రేట్లు విపరీతంగా పెంచారన్నారు. ఆర్టీసీ చార్జీలు, పెట్రోలు, గ్యాస్‌, కరెంటు, చార్జీలు ఒకటి మీద ఒకటి పెంచుకుంటూ పోవడంతో పేద ప్రజలు బతకడమే కష్టంగా మారిందన్నారు. ప్రతిప క్షంలో ఉండగా జగన్‌మోహన్‌రెడ్డి ముద్దులు పెట్టి అధికారం వచ్చిన తరువాత పిడిగు ద్దులు గుద్దుతున్నారన్నారు. బాదుడే బాదు డు కార్యక్రమం ద్వారా ప్రజలకు జగన్‌ మోహన్‌రెడ్డి చేస్తున్న దోపిడీని వివరించే ప్ర యత్నం చేస్తున్నామన్నారు. మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ ఎద్దల విజయసాగర్‌,  జడ్పీ టీసీ మాజీ సభ్యుడు శివరామరాజు, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి సమ్మెట శివ ప్రసాద్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్‌, నాయకులు గంధం గంగాధర్‌, తిరుపతయ్య, మోడపోతుల రాము, జ్యోతి శివ, తాటి సుబ్బరాయుడు, సురేష్‌, సుధాక ర్‌, సుబ్బరాయుడు, నరసయ్య, చామంచి పెంచలయ్య, తోట శివ, కొండయ్య, బుశెట్టి కిరణ్‌ చంద్ర, శ్రీరాములు, వరదయ్య, శ్రీను, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

రాజంపేట: మండలంలోని హెచ్‌.చెర్లోపల్లె గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు సుబ్బనరసయ్య ఆధ్వర్యంలో బాదుడే బాదు డు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మహిళా విభాగం  అధ్యక్షురాలు అనసూ యాదేవి, రాజం పేట పార్లమెంట్‌ అధి కార ప్రతినిధి అద్దేపల్లె ప్రతాప్‌రాజు, రాష్ట్ర బీసీ సెల్‌ నాయకులు ఇడిమడకల కుమార్‌, రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి కొండా శ్రీనివాసులు, ఎస్సీ సెల్‌ నాయకులు మందా శ్రీనివాసులు తదితరు లు పాల్గొన్నారు. 

ఒంటిమిట్ట:  కోనరాజుపల్లె, గుంటికాడపల్లె, అమోరిపల్లెల్లో  బాదుడే బాదుడు కార్యక్ర మం నిర్వహించారు.గ్రామంలో ఇంటింటికి వెళ్లి మూడేళ్లలో ప్రజలు పడ్డ ఇబ్బందులను తెలుసుకున్నారు. టీడీపీ నాయకులు బీసీ రాయుడు, గజ్జల నరసింహారెడ్డి, కోనరాచ పల్లె బాష, బొబ్బిలి రాయుడు, రామచంద్ర, కిరణ్‌స్వామి పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-26T04:39:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising