ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుల్హన రద్దుపై టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ

ABN, First Publish Date - 2022-07-01T05:44:46+05:30

తెలుగుదేశం ప్రభుత్వం నిరుపేద ముస్లిం కుటుంబాలలో ఆడ పిల్లల వివాహం కోసం ప్రవేశపెట్టిన దుల్హన పథ కాన్ని రద్ధు చేయడం పై గురువారం టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ ని ర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమలాపురం రూరల్‌, జూన 30: తెలుగుదేశం ప్రభుత్వం నిరుపేద ముస్లిం కుటుంబాలలో ఆడ పిల్లల వివాహం కోసం ప్రవేశపెట్టిన దుల్హన పథ కాన్ని రద్ధు చేయడం పై గురువారం టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ ని ర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్యసాయినాథ్‌శర్మ ఆధ్వర్యంలో కమలాపురం పట్టణంలో ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీకి హాజరయ్యారు. దుల్హన  పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీగా వస్తున్న సాయినాథ్‌శర్మ, ముస్లిం మైనార్టీ మహిళలను కమలాపురం ఎస్‌ఐ కొండారెడ్డి, సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా  సా యినాథ్‌శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేద ముస్లిం మైనార్టీ కుటుంబాలలోని ఆడ పిల్లల వివాహాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల ఆర్థిక సహా యం చేయడానికి దుల్హన పథకం పేరుతో 2015లో అప్పటి ముఖ్యమత్రి నారా చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ పథకం మొత్తాన్ని రూ.లక్షకు పెంచుతామని హామీ ఇచ్చి ఓట్లు దండుకొని నేడు పథకాన్నే రద్దు చేసి ముస్లిం మైనార్టీ మహిళలకు ద్రోహం చేయడం తగదన్నారు. ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్‌ రఫీ,  హైదర్‌ షుఖూర్‌,  బీసీ సంఘ నాయకులు రాయచోటి సుధాకర్‌, పెద్ద చెప్పలి ఎంపీటీసీ నాగరాజు ఆచారి, నాంద్యాల మహేష్‌, ఎస్సీ సంఘం నాయకులు నా మాల రమేష్‌, నామాల రాజలక్షుమయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T05:44:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising