కొత్త జీఓ ప్రకారం ‘రాజోలి’ పరిహారం
ABN, First Publish Date - 2022-04-19T05:04:27+05:30
రాజోలి ప్రాజెక్టు బాధిత రైతులకు కొత్త జీఓ ప్రకారం పరిహారం అందిస్తారని రైతులకు ఆర్డీఓ శ్రీనివాసులు సూచించారు.
ఎకరాకు రూ.12 నుంచి రూ.13 లక్షలు ఉండవచ్చు : ఆర్డీఓ
సమస్యలన్నీ పరిష్కారమయ్యేదాకా సర్వే ఆపాలి - రైతులు
జమ్మలమడుగు రూరల్, ఏప్రిల్ 18: రాజోలి ప్రాజెక్టు బాధిత రైతులకు కొత్త జీఓ ప్రకారం పరిహారం అందిస్తారని రైతులకు ఆర్డీఓ శ్రీనివాసులు సూచించారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయ సభాభవనంలో పెద్దముడియం మండలం రాజోలి ప్రాజెక్టు పరిసర గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి చిన్నముడియం, గరిశలూరు, నెమళ్లదిన్నె, చిదిపిరాళ్లదిన్నె, బలపనగూడూరు గ్రామాల నుంచి మొత్తం 85 మంది రైతులు వచ్చినట్లు తెలుస్తోంది. రాజోలి రైతుకు కొత్త జీఓ ప్రకారం రూ. 12 లక్షలు లేదా రూ. 13 లక్షలు ఉండవచ్చని ఆర్డీఓ అంచనా వేశారు.
ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, ఆశాజనకంగా రైతులకు పరిహారం అందించాలని, 18 నుంచి రూ.20 లక్షలు ఇవ్వాలని కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించినట్లు ఆయా గ్రామాల రైతులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుకు ప్రస్తుతం ఎక్కడైనా ఎకరా పొలం దొరుకుతోందా ఆ విధంగా ఉంటే ప్రభుత్వమే చిన్న, సన్నకారు రైతులకు భూములు ఇప్పించి పరిహారం అందించాలని, లేనాపక్షంలో జీవనాధారం కోల్పోతామని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల సర్వే కొద్దిరోజులు ఆగి చేయాలని, తమకు సమస్యలు ఉన్నాయని, పరిష్కారం చేసే వరకు ఆగాలని కొందరు రైతులు కోరారు. పరిహారం విషయంలో కటాఫ్‌డేట్ ఇస్తారా అని ఓ రైతు అడిగారు. ఇంటి ఆడపిల్లలకు ఎంత డబ్బు ఇస్తారని మరో రైతు ప్రశ్నించారు.
పొలంలో చెట్లు ఉన్నవారికి, బోర్లు ఉన్నవారికి డబ్బు పరిహారం ఏ విధంగా చెల్లిస్తారన్నారు. పీఏఎఫ్ ప్రకారం ఇంటికి ఒకరికి, పీడీఎఫ్ అంటే అందరికీ పరిహారం అందిస్తారని ఆర్డీఓ వివరించారు. ప్రస్తుతం గండికోట ప్రాజెక్టు నుంచి పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ డబ్బు రాక ఇబ్బంది పడుతూ తమ కార్యాల యం వద్దకు వస్తున్నారని, అలాంటి పరిస్థితి లేకుండా రాజోలి రైతులకు సమగ్రంగా సర్వే చేసి అర్హులందరికీ పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇ ళ్లు, పొలం, గ్రామాల్లో ఉండి బయటి ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పరిహారం ఎలా పరిష్కరిస్తారని ఓ రైతు అడిగా రు. అలాంటి వారందరికీ న్యాయం చేస్తామని, సభాభవనంలో కంట్రోల్‌పాయింట్ ఏర్పాటు చేసి రైతు సమస్యలు, రైతుల జాబితా ప్రదర్శనగా పెడతామన్నారు. అనంతరం సమావేశం చివరి సమయంలో రైతులు మూకుమ్మడిగా వచ్చి తమకు ఆశాజనకంగా పరిష్కారాలు చేయాలని తెలిపారు. రైతు సంఘం నేత సంబటూరు ప్రసాద్‌రెడి ్డ, స్పెషల్ కలెక్టర్ రామూనాయక్, డీఈలు రవీంద్ర, గోవిందరాజులు, జేఈలు సలీం, నూర్‌బాష, రామచంద్ర, మోహన కృష్ణారెడి ్డ, రాంప్రసాద్, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2022-04-19T05:04:27+05:30 IST