ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రతిపాదించాలి

ABN, First Publish Date - 2022-02-02T04:55:59+05:30

రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రతిపాదించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయరామరాజుకు నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు.

కలెక్టర్‌ విజయరామరాజుకు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, ఫిబ్రవరి 1: రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రతిపాదించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయరామరాజుకు నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేడా విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగం గా రాజంపేట కేంద్రంగా 15 ఎకరాలలో సబ్‌కలెక్టర్‌ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయం, ఫారెస్ట్‌ అధికారుల కార్యాలయాలు ఉన్నాయన్నారు. కడప, రేణిగుంటలో విమానాశ్రయాలు కలిగి ఉన్నాయన్నారు. రైల్వే వసతి, నేషనల్‌ హైవే, బహుదానది, ప్రపంచ ప్రసిద్దిగాంచిన ముగ్గురాయి, అన్నమయ్య నడయాడిన తాళ్లపాక, రెండవ భద్రాద్రిగా పేరుపొందిన ఒంటిమిట్ట కోదండరామాలయం, నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయం, 100 పడకల ఆసుపత్రి, కేంద్రీయ విశ్వవిద్యాలయంతో పాటు మరెన్నో వసతులు ఉన్నాయన్నారు. కావున మా విన్నపాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.య్‌స.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రతిపాదించేలా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. మాజీ ఎంపీపీ భువనబోయిన లక్ష్మీ నరసయ్య, జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ అమీ ర్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు కలీం, నడివీధి సుధాకర్‌, హిమగిరినాధ్‌ మోదుగుల చంద్ర  పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-02T04:55:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising