ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమీషన్ల కోసమే వాహనాల కొనుగోళ్లు

ABN, First Publish Date - 2022-08-09T04:28:32+05:30

రాష్ట్ర ప్రభు త్వం, అధికార పార్టీ నేతలు కమీషన్లు దం డుకునేందుకే చెత్తసేకరణ పేరిట వేల వాహనాలను కొనుగోలు చేశారని కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి విమర్శించారు.

సమావేశంలో మాట్లాడుతున్న మల్లెల లింగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెత్తపన్నుతో ప్రజలపై భారం

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, ఆగస్టు 8: రాష్ట్ర ప్రభు త్వం, అధికార పార్టీ నేతలు కమీషన్లు దం డుకునేందుకే చెత్తసేకరణ పేరిట వేల వాహనాలను కొనుగోలు చేశారని కడప పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెత్త సేకరణ విధానం ఇప్పుడొచ్చింది కానీ, వందల ఏళ్లనాటి నుంచి ఈ ప్రక్రియ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ, పంచాయతీలో కొనసాగుతోందన్నారు. దీని కోసం ఇదివరకే ప్రత్యేకించి ట్రక్కులు, ట్రాక్టర్లు, ఆటోలు ఉన్నాయని, వీటి ద్వారా చెత్తసేకరణ జరుగుతోందన్నారు.

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం కొత్తగా చెత్తపన్ను తీసుకొచ్చి, చెత్త సేకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2675 ఆటోలను కొనుగోలు చేసిందంటూ, ఇవన్నీ నాసిరకం గా ఉన్నాయని ఆరోపించారు. వీటి కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం, అధికారపార్టీ నేతల కమీషన్ల కక్కుర్తి దాగి ఉందన్నారు. గతంలో 108 వాహనాలు, సివిల్‌ సప్లయ్‌ డోర్‌ డెలివరీ వాహనాలు, ఇపుడు చెత్తపన్ను సేకరణ ఆటోల కొనుగోళ్లల్లో కమీషన్లు దండుకున్నారని లింగారెడ్డి ఘాటుగా విమర్శలు చేశారు. పారిశుధ్యం నిర్వహణ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ, పంచాయతీల ప్రాధమిక బాధ్యతన్నారు. ఆస్తిపన్నులోనే పారిశుధ్యం నిర్వాహణ ఖర్చు కూడా కలిసి ఉంటుందన్నారు.

చెత్తపన్ను వసూలుతో ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందన్నారు. ఇళ్లకు రూ.60 నుంచి రూ.90లు, అపార్టుమెంట్‌లకు రూ.200లు, వాణిజ్య సముదాయాలు, హాస్పిటళ్లకు రూ.300 నుంచి 1000లు వసూలు చేస్తున్నారన్నారు. చెత్తపన్ను వసూలు ఎగబడుతున్న ఈ చెత్త ప్రభుత్వానికి ప్రజలు తగిన విధంగా బుద్ది చెప్పాలన్నారు. సమావేశంలో టీడీపీ కడప పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి సానా విజయభాస్కర్‌రెడ్డి, కార్యదర్శి సిద్దయ్య టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి సుంకర వేణుగోపాల్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్బరాజు, మాజీ కౌన్సిలర్‌ సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T04:28:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising