‘విజయవాడ-ధర్మవరం’ రైలుకు పూజలు
ABN, First Publish Date - 2022-12-07T23:21:53+05:30
‘విజయవాడ-ధర్మవరం’ ఎక్స్‌ప్రెస్ రైలు మొదటి సారిగా కొండాపురం రైల్వే స్టేషన్‌లో బుధవారం నిల పడంతో కొండాపురం వాసు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొండాపురం, డిసెంబరు 7: ‘విజయవాడ-ధర్మవరం’ ఎక్స్‌ప్రెస్ రైలు మొదటి సారిగా కొండాపురం రైల్వే స్టేషన్‌లో బుధవారం నిల పడంతో కొండాపురం వాసు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ నుంచి ధర్మవరం (17215) రైలు బుధవారం ఉదయం 7:30గంటలకు కొండాపురం చేరుకుంది. కరోనా తర్వాత మొదటిసారి ఎక్స్‌ప్రెస్ నిలపడంతో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు వచ్చి పూజలు నిర్వహించారు. ‘విజయవాడకు వెళ్లే రైలు (17216) కొండాపురంలో రాత్రి 8:30గంటలకు చేరుతుంది. కార్యక్రమం లో సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌బాబు, టీడీపీ నేతలు గోరిశెట్టి బాబు, నరసింహారెడ్డి, రామనాథరెడ్డి, రైల్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:21:54+05:30 IST