ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలను సంరక్షించండి

ABN, First Publish Date - 2022-07-03T04:36:10+05:30

రోడ్డుకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ కింద నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు.

రోడ్డు పక్కన ఉన్న మొక్కను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గిరీషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రామాపురం, జూలై 2: రోడ్డుకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ కింద నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు. శనివారం ఆయన రామాపురం మండలం చిట్లూరు గ్రామ పంచాయతీ చెరువుముందరపల్లె గ్రామానికి వెళ్లే మార్గంలో రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కలకు రక్షణగార్డులు సక్రమంగా ఉండే విధంగా చూడాలని ఆయన ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కల చుట్టూ పిచ్చిమొక్కలు లేకుండా చూడాలని, మొక్కలు ఎండిపోకుండా పర్యవేక్షించాలని చెప్పారు. మానవాళి మనుగడ, పర్యావరణ సమతుల్యతకు మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. కానుగ మొక్కలను నాటాలని డ్వామా పీడీని ఆయన ఆదేశించారు. కలెక్టర్‌ వెంట డ్వామా పీడీ శివప్రసాద్‌, ఎంపీడీవో నాగరత్నమ్మ, ఉపాధి హామీ పథకం ఏపీవో సురేంద్రారెడ్డి, టీఏ సురేంద్రనాయుడు తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T04:36:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising