ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవన నిర్మాణాల్లో పురోగతి కనిపించాలి

ABN, First Publish Date - 2022-07-01T05:30:00+05:30

ప్రభుత్వ భవనాల నిర్మాణంలో పురోగతి కనిపించాలని, సాకులు చెప్పకుండా సీరియ్‌సగా పనిచేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీర్లను ఆదేశించారు.

జగనన్న కాలనీలో లబ్ధిదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాకులు చెప్పకుండా బాధ్యతగా పనిచేయండి

పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీర్లను హెచ్చరించిన కలెక్టర్‌ 

రాయచోటిటౌన్‌/కలెక్టరేట్‌, జూలై 1: ప్రభుత్వ భవనాల నిర్మాణంలో పురోగతి కనిపించాలని, సాకులు చెప్పకుండా సీరియ్‌సగా పనిచేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీర్లను ఆదేశించారు.  శుక్రవారం కలెక్టర్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో పంచాయతీరాజ్‌శాఖ ఈఈలు, డీఈలు, ఏఈలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌, డిజిటల్‌ లైబ్రరీ, ప్రభుత్వ శాశ్వత భవన నిర్మాణాల పురోగతిపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భవన నిర్మాణ పనులను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసి భవనాలను వెంటనే అప్పజెప్పాలన్నారు. బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ చేయాలన్నారు. 


దిగువ అబ్బవరం జగనన్న కాలనీ లేఅవుట్‌ పరిశీలన 

మండల పరిధిలోని దిగువ అబ్బవరం జగనన్న కాలనీ లేఅవుట్‌ను కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలోని సౌకర్యాలపై ఆరా తీశారు. తాగునీటి సమస్య ఉందని స్థానికులు కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా వెంటనే ఆయన ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈకి ఫోన్‌ చేసి జల్‌జీవన్‌ మిషన్‌ కింద బోరుతో పాటు నీటి కుళాయిల కనెక్షన్‌ ఇవ్వాలని ఆదేశించారు. 

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising