ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు కళాశాల బస్సు దగ్ధం

ABN, First Publish Date - 2022-05-28T05:12:06+05:30

పీలేరు పట్టణంలోని బీవీరెడ్డికాల నీలో శుక్రవారం ఓప్రైవే టు కళాశాల బస్సు దగ్ధ మైంది.

దగ్ధమవుతున్న బస్సు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు, మే 27: పీలేరు పట్టణంలోని బీవీరెడ్డికాల నీలో శుక్రవారం ఓప్రైవే టు కళాశాల బస్సు దగ్ధ మైంది. స్థానిక చైతన్య జూనియర్‌ కళాశాలకు చెందిన ప్రైవేటు బస్సును బీవీరెడ్డికాలనీలో ఉంచి ఉండగా శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిసరాల్లోని స్థానికులు  గమనించి పీలేరు అగ్నిమాపక కేంద్ర సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి మంట లను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమై పోయింది. బస్సు కాలనీలోని ఖాళీ ప్రదే శంలో ఉండడం వలన ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. 

నిందితుడికి శిక్ష ఖరారు

అరెస్ట్‌  వారెంట్‌ జారీ చేసిన న్యాయమూర్తి

పెద్దతిప్పసముద్రం మే 27:మండలంలోని కందుకూరులో 2012 లో జరిగిన చోరీ కేసులో నిందితుడైన వీరాంజనేయులు ఆలి యాస్‌ మధుకి కోర్టులో న్యాయమూర్తి భరత్‌ చంద్ర శిక్ష విధి స్తూ తీర్పు వెలువరించారు అయితే నిందితుడు పరారీలో ఉండ డంతో అతనిని పట్టుకుని కోర్టులో హాజరు పరచాలని అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. పెద్దతిప్పసముద్రం మండలం కం దు కూరు గ్రామానికి చెందిన వ్యాపారి నరేష్‌ బాబు ఇంటిలో 2012లో పగటి పూట దొంగతనం జరిగింది.  అనంతపురం జిల్లా దర్మవరంకు చెందిన వీరాంజనేయులు అలియాస్‌ మధు ఇంటి తాళాలు పగల కొట్టి బంగారు నగలు చోరీ చేసినట్లు గుర్తించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. శుక్రవారం ఈ కేసుపై న్యాయమూర్తి భరత్‌ చంద్ర తీర్పు చెపుతూ వీరాంజనేయులుపై నేరం రుజువైనందునా శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలవరించారు. నిందితుడిని కోర్టులో హాజరు పరి చిన తరువాత శిక్షా కాలం ఎంత అనేది వెల్లడిస్తామని న్యాయ మూర్తి భరత్‌ చంద్ర తెలిపారు. 

Updated Date - 2022-05-28T05:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising