ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్సీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2022-01-20T04:46:00+05:30

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పాలిట శాపమైన పీఆర్సీ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మీరాజా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా

కడప(ఎడ్యుకేషన్‌), జనవరి 19: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పాలిట శాపమైన పీఆర్సీ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా డిమాండ్‌ చేశారు. స్థానిక యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో బుధవా రం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం జరిగే కలెక్టరేట్‌ ముట్టడికి ఉపాధ్యాయులు, ఉద్యోగ, పెన్షనర్లు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అశుతో్‌షమిశ్రా కమిషన్‌ రిపోర్టును బహిర్గత పరచకుండా అధికారుల కమిటీతో ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక రాయించుకొని ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలలో భారీ కోత విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌, సహ అధ్యక్షుడు వై.రవికుమార్‌, జిల్లా కోశాధికారి పి.మహే్‌షబాబు, జిల్లా కార్యదర్శులు మస్తానయ్య, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 


నేటి ధర్నాకు ఎన్జీవో సంఘం మద్దతు

పీఆర్సీపై గురువారం ఉపాధ్యాయ సంఘాల ధర్నాకు ఏపీ ఎన్జీవో జిల్లా సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు శ్రీనివాసులు, రవికుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఏపీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కూడా మద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు కె.విజయకుమార్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.ప్రశాంత్‌కుమార్‌, కార్యదర్శి శోభన్‌బాబు తెలిపారు. ధర్నాకు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు హాజరై విజయ వంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Updated Date - 2022-01-20T04:46:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising