ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2022-05-25T05:01:25+05:30

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌. రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

ప్రజా సమస్యలపై ఆరా తీస్తున్న మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాలివీడు, మే 24: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌. రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన వెలిగల్లు పంచాయతీలో పర్యటించి ప్రజా సమస్యల పై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు నిత్యావసరాలను కొనే పరిస్థితుల్లో లేరన్నారు. టీడీపీ ర హయాంలోనే గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఏర్పడ్డాయన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప ఈ ప్రభుత్వానికి అభివృద్ధి చేతకాదని విమర్శించారు. విద్యుత్‌ చార్జీలు, బస్సు చార్జీలు పెంచడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. పూరిగుడిసెలకు వేలల్లో కరెంటు బిల్లులు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో అడిగిన వారందరికీ ట్రాన్స్‌పార్మర్లను అందజేశామని, కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. కులవృత్తి పరికరాలను సబ్సిడీపై అందించిన ఘనత చంద్రబాబునాయుడుదేనని కొనియాడారు. అనంతరం కృష్ణమూర్తి ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి, పూలుకుంట సర్పంచ్‌ పార్థసారథిరెడ్డి, మాజీ బోర్డు మెంబర్‌ మహబూబ్‌బాషా, మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య, టీడీపీ నాయకులు కృష్ణమూర్తి, శ్రీనివాసులు, మనోహర్‌, కదిరిరెడ్డి, డాక్టర్‌ రామచంద్రారెడ్డి, జక్రియాబాషా, ప్రభాకర్‌రెడ్డి,  రామాంజులునాయుడు, నూరుల్లా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:01:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising