పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది
ABN, First Publish Date - 2022-12-15T23:10:01+05:30
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని కలెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియాలు కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విగ్రహ నిర్మాణానికి అనుకూలమైన ప్రాంతం గుర్తించండి
కలెక్టర్ పీఎస్ గిరీషా
రాయచోటి (కలెక్టరేట్), డిసెంబరు 15: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని కలెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియాలు కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగమూర్తి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడు, మహనీయుడని కొనియాడారు. మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహా వ్యక్తి అన్నారు. మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాల ద్వారా వారి జీవితం నుంచి స్ఫూర్తి పొంది యువత సన్మార్గంలో దేశభక్తితో మెలగాలని కోరారు. రాయచోటి పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణానికి అందరికీ అనుకూలమైన ప్రాంతాన్ని గుర్తించి నివేదిక పంపాలని అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో సత్యనారాయణ, కలెక్టరేట్ ఏవో బాలకృష్ణ, బీసీ సంక్షేమ శాఖాధికారి సందప్ప, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు సురే్‌షబాబు, హరీ్‌షబాబు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం వెలగపూడి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన అర్జీదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి బాధితులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఫొటోలను కూడా స్పందన పోర్టల్‌లో అప్లోడ్ చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తయ్యేందుకు ఒక్కో లబ్ధిదారుడికి రూ.35 వేలు రుణం ఇప్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ గిరీషా మాట్లాడుతూ జగనన్న హౌసింగ్ లేఅవుట్లలో నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు అందరూ ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అనీమియా బాధితులు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకునే విధంగా ఐసీడీఎస్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జేసీ తమీమ్ అన్సారియా, డీఆర్వో సత్యనారాయణ, డీపీవో ధనలక్ష్మి, హౌసింగ్ పీడీ శివయ్య, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ, భూముల సర్వే విభాగం సహాయ సంచాలకులు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:10:05+05:30 IST