ఉత్తమ ఫలితాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
ABN, First Publish Date - 2022-12-15T23:29:47+05:30
ఉత్తమ ఫలితాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సమగ్రశిక్ష జిల్లా పథక అఽధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాకు ప్రథమ స్థానమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లాకు ప్రథమ స్థానమే లక్ష్యం
సమగ్ర శిక్ష పథక అధికారి ప్రభాకర్ రెడ్డి
కడప (ఎడ్యుకేషన్), డిసెంబరు 15: ఉత్తమ ఫలితాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సమగ్రశిక్ష జిల్లా పథక అఽధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. జిల్లాకు ప్రథమ స్థానమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కడప నగరం గాంధీనగర్ మున్సిపల్ హైస్కూలులో గురువారం ఎస్‌ఎ్‌ససీ ప్రశ్నాపత్రం ఫ్రిపరేషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నాపత్రాలపై ప్రతి విద్యార్థికి అవగాహన పెంచాలని.. అలా పెంచినప్పుడే విద్యార్థికి పరీక్ష విఽధానానికి అనుగుణంగా విద్యాభ్యాసం సాగిస్తారని, మంచి ఫలితాలు సాధిస్తారన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎంఈవోలు, ఉప విద్యాధికారులు ఎప్పటికప్పుడు ప్రిపరేషన్‌పై పర్యవేక్షణ, ప్రణాళికవంటి వాటిపై సమీక్ష చేయాలన్నారు. సబ్జెక్టు టీచర్లకు కొంతమంది విద్యార్థులను దత్తత ఇవ్వాలని.. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలన్నారు. ఉప విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ లెవెల్‌లో ఎప్పటికప్పుడు ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష చేస్తూ సబ్జెక్టు టీచర్ల ప్రకారం విద్యార్థులకు ప్రశ్నాపత్రాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మేథమేటిక్స్ రిసోర్స్ పర్సన్ సురేష్, సూర్యనారాయణరెడ్డి ప్రశ్నాపత్నాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉప విద్యాధికారి కార్యాలయ సిబ్బంది, డీసీఈబీ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:29:50+05:30 IST