ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం సూచించిన ధరకు స్థలాలు ఇవ్వలేం

ABN, First Publish Date - 2022-06-26T05:02:01+05:30

ప్రభుత్వం సూచించిన రేట్లకు స్థ లాలు ఇవ్వలేమని కమలాపురం నగర పంచాయతీలో నూతనంగా నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి (ఆర్‌ఓబీ)కి స్థలం కో ల్పోయిన బాధితులు స్పష్టం చేశారు.

నిరసన తెలుపుతున్న బాధితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుకాణాలు మూసి నిరసన తెలిపిన బాధితులు 

కమలాపురం రూరల్‌, జూన 25 : ప్రభుత్వం సూచించిన రేట్లకు స్థ లాలు ఇవ్వలేమని కమలాపురం నగర పంచాయతీలో నూతనంగా నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి (ఆర్‌ఓబీ)కి స్థలం కో ల్పోయిన బాధితులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రేట్లకు స్థలాలు ఇవ్వలేమని రోడ్డుపై నిరసన తెలిపి రైల్వే గేటు నుంచి స్టేట్‌ బ్యాంక్‌ వరకు దుకాణాలు మూసేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారం ఏమాత్రం సరిపోదన్నారు. ఫ్లైఓవర్‌ ఏర్పాటు వల్ల అధిక శాతం నష్టపోయేది తామేనని, అంత తక్కువ ధరకు ఇవ్వడం వల్ల వ్యాపార సంస్థలను మూసుకోవలసి వస్తుందన్నారు. వ్యాపారాలు ఉండవని, అలాంటప్పుడు తక్కువ రేటుకు స్థలాలు ఎలా ఇవ్వమంటారని ప్రశ్నించారు. రైల్వే గేట్‌ నుంచి స్టేట్‌ బ్యాంక్‌ వరకు దాదాపు 107 మంది లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం సెంటుకు రెండు లక్షల ఆరవైవేల రూపాయలు తమకు సమ్మతం లేదన్నారు. కమలాపురం మెయినలో మార్కెట్‌ రేట్‌ ప్రకారం సెంటు 25 లక్షల రూపాయలు ఉందన్నారు. నష్టపరిహారం విషయమై ప్రభుత్వం ఏ సమావేశం నిర్వహించినా హాజరు కాబోమన్నారు. శంకర్‌రెడ్డి వెంకటశివ, పబ్బతి నరసింహా సురేష్‌, రమణారెడ్డి, మోహన తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T05:02:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising