ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదాములకు చేరిన వేరుశనగ విత్తన కాయలు

ABN, First Publish Date - 2022-05-22T05:14:18+05:30

పీలేరు నియోజకవర్గం లోని ఆర్‌బీకేల గోదాములకు వేరుశనగ విత్తన కాయలు చేరాయి.

పీలేరుకు చేరిన వేరుశనగ విత్తనకాయలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు, మే 21: పీలేరు నియోజకవర్గం లోని ఆర్‌బీకేల గోదాములకు వేరుశనగ విత్తన కాయలు చేరాయి. ఖరీఫ్‌లో సాగు కోసం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో  సబ్సి డీ విత్తన కాయలను రెండు రోజులుగా సిద్ధం చేస్తున్నారు. పీలేరు మండలానికి 1730 క్వింటాళ్ల విత్తనకాయలకుగానూ ఇప్పటికీ 810 క్వింటాళ్ల కాయలు వచ్చా యని, మిగిలినవి రెండు, మూడు రోజుల్లో రానున్నట్లు వ్యవసాయాధికారి కళ్యాణబాబు    తెలిపారు. ఆర్‌బీకేల ద్వారా విత్తన కాయలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కిలో ధర రూ.51.48 నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 

రేపటి నుంచి విత్తనాల కోసం రిజిస్ర్టేషన్‌ 


వాల్మీకిపురం, మే 21 :  వేరుశనగ విత్తనాల కోసం ఈనెల 23 నుంచి రిజిస్ర్టేషన్‌ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఏవో హేమలత తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ 40శాతం రాయితీతో  వేరుశనగ విత్తనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 30కిలోల బ్యాగ్‌ ధర రూ.2574లు అని అందులో రైతువాటా రూ.1544.40లు ఉంటుందన్నారు. మండలానికి కె 6 రకం విత్తనాలు 700 క్వింటాళ్లు, నారాయణి రకం 1500 క్వింటాళ్లు కేటాయించినట్లు తెలిపారు. రైతులు రైతుభరోసా కేంద్రంలో పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్‌ తీసుకురావాల్సివుంటుందన్నారు.

Updated Date - 2022-05-22T05:14:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising