ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీడీపీఓ సూపర్‌వైజర్‌ అక్రమాలపై పీడీ విచారణ

ABN, First Publish Date - 2022-06-26T04:38:21+05:30

ఐసీడీఎస్‌ రూరల్‌ ప్రాజెక్టు సీడీపీఓ నిర్మల, సూపర్‌ వైజర్‌ శారదపై వచ్చిన ఆరోపణల పై స్త్రీ శిశుసంక్షేమ శాఖ (ఐసీడీఎ్‌స)జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎంఎన్‌ రాణి విచారణ చేపట్టారు.

అంగన్‌ వాడీ కార్యకర్తలను విచారిస్తున్న పీడీ రాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు అర్బన్‌ జూన్‌ 25: ఐసీడీఎస్‌ రూరల్‌ ప్రాజెక్టు సీడీపీఓ నిర్మల, సూపర్‌ వైజర్‌ శారదపై వచ్చిన ఆరోపణల పై స్త్రీ శిశుసంక్షేమ శాఖ (ఐసీడీఎ్‌స)జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎంఎన్‌ రాణి విచారణ చేపట్టారు. స్థానిక ప్రాజెక్టు కార్యాలయంలో అంగన్‌ వాడీ వర్కర్ల విచారణలో వెంగల్‌రెడ్డి పేట సెంటర్‌ అంగన్‌వాడీ వర్కర్‌ రమాదేవి మరణంపై, ఏఐటీ యూసీ యూనియన్‌ నేతల ఆరోపణలపై కార్యకర్తలతో లిఖి త పూర్వకంగా అభిప్రాయాలు సేకరించారు. సీడీపీఓపై వ చ్చిన ఆరోపణలపైనా విచారించారు. పీడీ మాట్లాడుతూ స్ర్తీ శిశు సంక్షేమ శాఖ స్టేట్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించామన్నారు. తప్పు జరిగి ఉంటే సీడీపీఓ బదిలీ అయినా వదిలే ప్రసక్తేలేదన్నారు. విచారణ నివేదికను కలెక్టర్‌, రాష్ట్ర అధికారులకు నివేదిస్తామన్నారు.

పీడీకి ఏఐటీయూసీ నేతల వినతి

 ఐసీడీఎస్‌పై వచ్చిన ఆరోపణల మీద విచారించేందుకు వచ్చిన పీడీని ఏఐటీయూసీ నేతలు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కలిశారు. రూ. మూడు లక్షలు తీసుకుని ఎల్లమ్మ టెంపుల్‌ ఏరియా సెంటర్‌ ఆయా పోస్టుకు స్థానికేతురాలైన చాగలమర్రి వాసి అనురాధను నియమించినట్లు సుబ్బరాయుడు ఆరోపించారు. సరుకులను సకాలంలో పంపిణీ చే యకుండా తనకు కావాల్సినవారికి టెండర్లు ఇచ్చిందని విమ ర్శించారు. ఈ ఆరోపణలపై కూడా విచారించాలని కోరారు. 

Updated Date - 2022-06-26T04:38:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising