ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు భాష పట్ల మక్కువ పెంచుకోవాలి

ABN, First Publish Date - 2022-12-06T23:20:35+05:30

తెలుగు సూర్యుడు సీపీబ్రౌన్‌ స్ఫూర్తితో ప్రతి విద్యార్థినీ, విద్యార్థులూ తెలుగుభాష పట్ల మక్కువ పెంచుకోవాలని యోగివేమన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సూర్యకళావతి సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న వీసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీబ్రౌన్‌ వారోత్సవ ప్రారంభంలో వైవీయూ వీసీ

కడప (కల్చరల్‌), డిసెంబరు 6: తెలుగు సూర్యుడు సీపీబ్రౌన్‌ స్ఫూర్తితో ప్రతి విద్యార్థినీ, విద్యార్థులూ తెలుగుభాష పట్ల మక్కువ పెంచుకోవాలని యోగివేమన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సూర్యకళావతి సూచించారు. బ్రౌన్‌ ఆంగ్లేయుడైనా తెలుగుభాషా సాహిత్యాలను పునరుద్ధరించి జాతికి స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. భావి పౌరులైన విద్యార్థులు తెలుగుభాష ను మనభాషగా భావించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బ్రౌన్‌ 139వ వర్ధంతి ని పురస్కరించుకుని ఈనెల 6వ తేదీ (మంగళవారం) నుంచి 12వ తేదీ వర కూ సీపీబ్రౌన్‌ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో తొలిరోజున ప్రా రంభ సమావేశాన్ని, పద్యపఠన పోటీని నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ బ్రౌన్‌ కృషితోనే వేమన తెలుగు నేలలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

విద్యార్థులు పద్యపఠన పోటీల్లో పాల్గొనడం చాలా అవసరమన్నారు. తెలుగు భాషా సాహిత్యాలపై అభిరుచి పెరగడానికి అది దోహదపడుతుందన్నారు. తదనంతర 6,7,8, తరగతుల విద్యార్థులకు పద్యపఠనం నిర్వహించారు. కార్యక్రమంలో విశిష్ఠ అతిథులు లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప అన్నమయ్య పూర్వ గవర్నర్‌ చిన్నపరెడ్డి, వైవీయూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ఆచార్య కె. గంగయ్య, సి.డి.సి.డీన్‌ వై.సుబ్బరాయుడు, సి.పి.బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రం బాధ్యులు మూల మల్లికార్జునరెడ్డి, పాల్గొన్నారు. ఇందులో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:20:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising