ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా పార్వేట ఉత్సవం

ABN, First Publish Date - 2022-01-17T04:50:14+05:30

ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో సంక్రాంతిని పురస్కరించుకుని ఆదివారం స్వామివారి పార్వేట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

రాజుపాళెం మండలం టంగుటూరు గ్రామంలో సోమేశ్వరస్వామి ఊరేగుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, జనవరి 16 : ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో సంక్రాంతిని పురస్కరించుకుని ఆదివారం స్వామివారి పార్వేట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి సుందరంగా అలంకరించారు. పూజలు అనంతరం గోపూజ మహోత్సవం నిర్వహించారు.  గంగాగౌరి సమేత ముక్తిరామలింగేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆర్టీపీపీ రోడ్డులోని పెన్నా తీరం వద్ద పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ పల్లేటి శంకర్‌రెడ్డి, ఈఓ రామచంద్రాచార్యులు, పాలకమండలి సభ్యులు, ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

రాజుపాళెం..:  ప్రముఖ పుణ్యక్షేత్రమైన వెల్లాల చెన్నకేశవ, శ్రీదేవి, భూదేవి సమేత భీమలింగేశ్వర గంగాదేవి, పార్వతీదేవి పార్వేట ఉత్సవాన్ని శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. హనుమత్‌ వాహనంపై ప్రత్యేక అలంకరణ చేసి చెక్కభజనలు, కోలాటాలు ఆహ్లాదకరంగా  పార్వేట ఉత్సవం సాగింది. గోపల్లె, కర్నూలుజిల్లాలోని మల్లవేముల, దద్దనాల, పగిడాల, కుమ్మరపలె ్ల, పర్లపాడు గ్రామాల్లో స్వాములవారిని ఊరేగిస్తూ పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ కానాల లక్ష్మీదేవి, ఈవో శోభారాణి, మండల ఉపాధ్యక్షుడు వెలువలి నారాయణరెడ్డి , సర్పంచ్‌ గోవర్దన్‌రెడ్డి, జడ్పీటీసీ అంజనాదేవి, బలరామిరెడ్డి , మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ సూర్యనారాయణరెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతేగాక మండల పరిధిలోని టంగుటూరు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం సోమేశ్వర సమేత పార్వతీదేవి,మదన గోపాలస్వామి సమేత శ్రీదేవి, భూదేవి పార్వేట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో చెక్కభజనలు చేస్తూ ప్రజలకు ఆనందాన్ని కలిగించారు. ఈ పార్వేట ఉత్సవం మెయిన్‌ రోడ్డు వెంబడి అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఛైర్మన్‌ గోన వెంకటసుబ్బారెడ్డి, నాయకులు మానికింది అమీర్‌బాష, కొర్రపాటి గౌతమ్‌రెడ్డి, కందుకూరి నడిపెన్న, ఎంపీటీసీ గుత్తి దస్తగిరి, తుఫాన్‌బాష, ఆలయ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-17T04:50:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising