ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనులపండువగా పార్వేట ఉత్సవం

ABN, First Publish Date - 2022-01-17T04:57:33+05:30

కనుమ పండుగ సందర్బంగా ఆదివారం సాయంత్రం శ్రీదేవి,భూదేవీలతో మాధవరాయ స్వామి వారు ప్రత్యేక అలంకరణలో పల్లకిలో పార్వేటకు బయలుదేరారు.

మైదుకూరులో శ్రీదేవి భూదేవి సమేత మాధవరాయస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు, జనవరి 16 :కనుమ పండుగ సందర్బంగా ఆదివారం సాయంత్రం శ్రీదేవి,భూదేవీలతో మాధవరాయ స్వామి వారు ప్రత్యేక అలంకరణలో పల్లకిలో పార్వేటకు బయలుదేరారు. పట్టణ శివారు ప్రాంతాలైన 16 గ్రామాల్లో పార్వేట ముగించుకొని తరువాత మైదుకూరుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  కోలాటం, చెక్కభజన. విచిత్రవేషాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

బి.కోడూరులో : మండల పరిఽధిలోని బి.కోడూరు గ్రామంలో  పార్వేట కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఊరేగింపుగా గ్రామ పురవీధుల గుండా బాజాబజంత్రీల నడుమసాగింది. 

పోరుమామిళలో : వాసవీ కన్యకాపమరేశ్వరి మాత విగ్రహాన్ని పోరుమామిళ్లలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.  ఈ సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. 

ఖాజీపేటలో: కనుమపండుగ సందర్భంగా సీతారాముల ఉత్సవ విగ్రహాలను డప్పు వాయిద్యాల మఽధ్య పార్వేట కార్యక్రమం నిర్వహిస్తారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక దుంపలగట్టు గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆవుకుపూజ నిర్వహించారు.

దువ్వూరులో: ఇడమడక గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో శనివారం స్వామివారి కల్యాణం, పార్వేట మహోత్సవాన్ని నిర్వహించారు.  పాత దువ్వూరులోని కోదండరామస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలను అంగరంగ వైభవంగా పార్వేట మహోత్సవం నిర్వహించారు.  పార్వేట కార్యక్రమాన్ని ఆలయ ఛైర్మన్‌ కొర్రపాటి రామసుబ్బయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డిలు ప్రారంభించారు. యువకులుఉత్సామంగా పాల్గొన్నారు.  గొల్లపల్లెలో చెన్నకేశవస్వామిని గ్రామాల వెంట వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. పెద్దజొన్నవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్వేట ఉత్సవం నిర్వహించారు.



Updated Date - 2022-01-17T04:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising