ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాపాఘ్ని నది అప్రోచ్‌ రోడ్డుకు గండి

ABN, First Publish Date - 2022-08-04T05:30:00+05:30

కమలాపురం సమీపంలోని కడప-తాడిపత్రి మార్గంలో ఉన్న పాపాఘ్ని నదిలో అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో మరోమారు కడప - తాడి పత్రి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గత ఏడాది 2021 నవంబరులో కురిసిన భారీ వర్షాలకు కమలాపురం పాపాఘ్ని నది వంతెన కూలిపోయిన సంగతి తెలిసినదే.

కమలాపురం సమీపంలో పాపాఘ్ని నదిలో కొట్టుకుపోయిన అప్రోచ్‌ రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీటి ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డు

కడప తాడిపత్రి వాహనాల రాకపోకలు బంద్‌

అప్రమత్తమైన రెవెన్యూ పోలీస్‌ అధికారులు 

కమలాపురం రూరల్‌, ఆగస్టు 4: కమలాపురం సమీపంలోని కడప-తాడిపత్రి మార్గంలో ఉన్న పాపాఘ్ని నదిలో అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో మరోమారు కడప - తాడి పత్రి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గత ఏడాది 2021 నవంబరులో కురిసిన భారీ వర్షాలకు కమలాపురం పాపాఘ్ని నది వంతెన కూలిపోయిన సంగతి తెలిసినదే. ఆ మార్గంలో వాహనాల రాకపోకల కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో పాపాఘ్ని నదిలో అప్రోచ్‌ రోడ్డును రూ.6.50 కోట్లతో ఏర్పాటు చేశారు. వారం పది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వెలిగల్లు ప్రాజెక్టు నిండడంతో అధికారులు బుధవారం రాత్రి సుమారు తొమ్మిది గేట్లు ఎత్తి వేసినట్లు సమాచారం. దీంతో పాపాఘ్ని నదిలోకి పై వైపు నుంచి ఉధృతితో వర్షపు నీరు రావడంతో కమలాపురం సమీపంలోని అప్రోచ్‌రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో కడప-తాడిపత్రి మార్గంలో వాహనాల రాకపోకలు బంద్‌ అయ్యాయి. అప్రమత్తమైన రూర ల్‌ సీఐ రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌ఐ కొండారెడ్డి, తహసీల్దార్‌ అమరేశ్వరి పాపాఘ్ని నదీ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ఈ అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోవడంతో తిరిగి కమలాపురం ప్రాంత ప్రజలకు ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి. 

బస్సుల దారి మళ్లింపు : పాపాఘ్ని నదిలో అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోవడంతో కడప-తాడిపత్రి మార్గంలో బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు దారి మళ్లించారు. కమలాపురం నుంచి ఖాజీపేట మీదుగా వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-08-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising