ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులకు ఒక న్యాయం, భూకబ్జాదారులకు మరో న్యాయమా..?

ABN, First Publish Date - 2022-12-06T23:32:17+05:30

మండలంలో ప్రభుత్వ భూములకు సంబంధించి దళితులు,పేదలకు ఒక న్యాయం భూకబ్జాదారులకు మరోన్యాయం అన్నట్లుగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అన్వేష్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం

కాశినాయన డిసెంబరు6: మండలంలో ప్రభుత్వ భూములకు సంబంధించి దళితులు,పేదలకు ఒక న్యాయం భూకబ్జాదారులకు మరోన్యాయం అన్నట్లుగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అన్వేష్‌ పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ మంగళవారం నర్సాపురం తహసీల్దారు కార్యాలయం ముందు జిల్లావ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆకులనారాయణపల్ల్లె చెందిన పలువురు దళితులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా అన్వేష్‌ మాట్లాడుతూ కత్తెరగండ్ల పొలం సర్వేనెంబర్‌ 2227లో స్థానిక పేదలు ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటుంటే రెవెన్యూ అధికారులు సోమవారం పొలంమీదికిపోయి నిలుపుదల చేశారన్నారు. అదే నాయనపల్లె రెవెన్యూ పొలంలోని సర్వేనెంబరు 217లో చుట్టుపక్క గ్రామాలకు చెందిన కొంతమంది అధికార పార్టీనాయకులు వందల ఎకరాలు ఆక్రమించుకుంటున్నా అటువైపు కన్నెత్తికూడా చూడటంలేదని ఆరోపించారు. అనంతరం తహసీల్దారు రామచంద్రుడికి వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో నాయకులు పోలయ్య,బాబు, సుబ్బారావు, లక్ష్మమయ్య, హుస్సేన్‌ పలువురు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising