రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలి
ABN, First Publish Date - 2022-12-15T23:05:22+05:30
రబీ సీజనులో రైతులకు వ్యవసాయాధికారులు అందుబాటు లో ఉండాలని సహాయ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ నాగరాజు పేర్కొన్నారు.
గోపవరం, డిసెంబరు 15: రబీ సీజనులో రైతులకు వ్యవసాయాధికారులు అందుబాటు లో ఉండాలని సహాయ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ నాగరాజు పేర్కొన్నారు. గురు వారం డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల వ్యవసాయాధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలు, వాటి విస్తీర్ణం, మాండుస్ తుఫాన్ పంట నష్ట వివరాలు, పీఎం కిసాన్, రబీ ఈక్రాప్ ద్వారా పంట నమోదు తదితర విషయాల గురించి చర్చించారు.
రబీ సీజన్‌లో రైతులు సాగు చేసే పంటల్లో ఎరువులు, పురుగు మందులు యాజమాన్యం గురించి రైతులకు వివరించి రైతులకు ఆర్‌బీకేలో ఎరువులను అందుబాటులో ఉంచాలని అలా చేయని అలసత్వం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి అరవింద్‌నాయక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:05:27+05:30 IST