ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి

ABN, First Publish Date - 2022-10-08T04:45:47+05:30

పేదవారి సొంతింటి కల నెరవేర్చేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సచివాలయ హౌసింగ్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీవోలతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విధుల్లో నిర్లక్ష్యం వహించే ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లపై చర్యలు

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి(కలెక్టరేట్‌), అక్టోబరు 7: పేదవారి సొంతింటి కల నెరవేర్చేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సచివాలయ హౌసింగ్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీవోలతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. జిల్లాలో 73,069 ఇళ్లు మంజూరు కాగా ఇందులో 12 వేలకు పైగా ఇంటి నిర్మాణాలు ప్రారంభం కాలేదని, అక్టోబరు 15లోగా వాటన్నిటినీ తప్పనిసరిగా బీబీఎల్‌ స్థాయికి తీసుకురావాలని ఆదేశించారు. రాయచోటి, రాజంపేట నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్నాయని పేర్కొన్నారు. లక్ష్యంలో ప్రగతి సాధించని సంబంధిత ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, ఎంపీడీవోలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి సాంకేతికపరమైన సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణశాఖ పీడీ శివయ్య, ఆర్డీవోలు రంగస్వామి, కోదండరామిరెడ్డి, మురళి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, హౌసింగ్‌ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. 


సచివాలయ వ్యవస్థ కీలకం

రామాపురం, అక్టోబరు 7: గ్రామ, వార్డు సమస్యల పరిష్కారంలో గ్రామ సచివాలయ వ్యవస్థ కీలకమని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అన్నారు. మండలంలోని కసిరెడ్డిగారిపల్లె గ్రామంలోని సూర్యనారాయణపురం గ్రామ సచివాలయం, హసనాపురంలోని పప్పిరెడ్డిగారిపల్లె గ్రామ సచివాలయాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూమెంటు రిజిస్టర్‌, సంక్షేమ పథకాల క్యాలెండర్‌, ఎస్‌ఎల్‌ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక తదితర వాటిని పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్‌ సత్యానందం, ఎంపీడీవో హైదర్‌వలి, ఎంఈవో రామకృష్ణుడు, ఏవో నాగమణి, ఏపీఎం రెడ్డెమ్మ, హౌసింగ్‌ ఏఈ ప్రసాద్‌, మండల ఇంజనీర్‌ చంద్రఓబుల్‌రెడ్డి, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు నాగమణి, ఓబులమ్మ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T04:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising