ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు వద్దు

ABN, First Publish Date - 2022-10-02T05:13:04+05:30

సచివాలయాలలో రిజి స్ట్రేషన్లు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటి వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశా రు.

ధర్నాలో మాట్లాడుతున్న వేణుగోపాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దస్తావేజు లేఖర్ల వ్యవస్థను కొనసాగించాలి 

ధర్నాలో డీవీఎల్‌వీపీఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి

కడప (మారుతీనగర్‌), అక్టోబర్‌ 1:. సచివాలయాలలో రిజి స్ట్రేషన్లు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటి వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశా రు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శా ఖలో అనాదిగా దస్తావేజు లే ఖరుల వ్యవస్థ ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం స్పందించి లేఖర్ల వ్యవస్థను కొనసాగించేలా లైసెన్సులు ఇచ్చేలా తగుచర్యలు తీసుకోవాలన్నారు. 2వ తేదీ నుంచి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు, స్టాం పువెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, లేఖరుల సహాయకుల రాష్ట్ర సమితి పిలుపు మేరకు  శనివారం రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వేణుగోపాల్‌, నగర అధ్యక్షుడు సంజీవరాయుడు మాట్లాడుతూ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల వలన ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోతుందన్నారు. భూ తగాదాలు ఏర్పడుతాయని, ప్రభుత్వ భూములు స్వాహా అవుతాయని, ప్రజల ఆస్తులు కబ్జాలకు గుర య్యే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. దస్తావేజు లేఖరులు రిజిస్ట్రేషన్‌ శాఖకు ఆర్థిక వనరులు సమకూర్చే అనుసంధాన కర్తలుగా ఉన్నారన్నారు. దస్తావేజులు రాసి రిజిస్ట్రేషన్లు చేయించి ప్రజలు ఇచ్చే సాఽధారణ ఫీ జుతో కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. త మ జీవనోపాధికి భంగం వా టిల్లే విధంగా పాలక ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వం మానవత్వంతో లేఖరులకు లైసెన్సులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సమితి కడప నగర నాయకులు నాగరాజు, ఓబులేసు, రామకృష్ణారెడ్డి, లోకనాథం, మో హన్‌, ఇక్బాల్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T05:13:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising