రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు నందిమండలం విద్యార్థులు
ABN, First Publish Date - 2022-12-16T23:15:41+05:30
రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ స్కూల్ గేమ్స్ పోటీలకు నందిమండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం కళావతి, పీడీ రాజశేఖర్ తెలిపారు.
పెండ్లిమర్రి, డిసెంబరు 16: రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ స్కూల్ గేమ్స్ పోటీలకు నందిమండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం కళావతి, పీడీ రాజశేఖర్ తెలిపారు. అండర్-14 కేటగిరిలో అనంతపురం జిల్లా కదిరిలో ఈనెల 28,29, 30 తేదీల్లో జరిగే పోటీలకు హాజరవుతారన్నారు. వెంకటశ్రీరామ్, ఆదిశేషారెడ్డి, జయసింహారెడ్డి, వెంకటనరసింహ చరణ్, విష్ణువర్దన్, సాయికిరణ్, చైతన్య, బాలికలు కీర్తన, పల్లవి, ఉమామహేశ్వరి, జయశ్రీ, ప్రకాశం జిల్లాలోని దొనకొండలో జరిగే పోటీల్లో అండర్-17 బాలురు రహీం, విజయరాజు, పృనే్‌షకుమార్, బాలికలు బుజ్జి, శ్రీవిద్య ఎంపికయ్యారు. విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవడం సంతోషంగా ఉందన్నారు.
Updated Date - 2022-12-16T23:15:42+05:30 IST