ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి కోసం మా అమ్మను చంపేశారు

ABN, First Publish Date - 2022-08-14T04:26:46+05:30

ఆస్తి కోసం సుబ్బమ్మ వారి బంధువులైన చంద్రబాబు ఇంకా ఇద్దరు కలిసి మా అమ్మ వసుంధరను హత్య చేశారని వినాయతి, వైష్ణవి అనే అమ్మాయిలు వారి మేనమామతో కలిసి కలెక్టర్‌ గిరీషాకు శనివారం మధ్యాహ్యం వినతిపత్రం ఇచ్చారు.

హత్య విషయాలను కలెక్టర్‌కు వివరిస్తున్న చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీరే న్యాయం చేయండి 

కలెక్టర్‌కు విన్నవించిన చిన్నారులు


రాయచోటి (కలెక్టరేట్‌), ఆగస్టు 13: ఆస్తి కోసం సుబ్బమ్మ వారి బంధువులైన చంద్రబాబు ఇంకా ఇద్దరు కలిసి మా అమ్మ వసుంధరను హత్య చేశారని వినాయతి, వైష్ణవి అనే అమ్మాయిలు వారి మేనమామతో కలిసి కలెక్టర్‌ గిరీషాకు శనివారం మధ్యాహ్యం వినతిపత్రం ఇచ్చారు. ఈ సంఘటనపైన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారా అని అమ్మాయిల వెంట వచ్చిన వారి మేనమామను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ఆస్తి విషయంలో కూడా పూర్తిగా విచారించి మీకు చెందేటట్లు అన్ని విధాలా సహాయం చేస్తానని వారికి నచ్చజెప్పారు. ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకుని ఈ పిల్లలకు వీలైనంత త్వరలో న్యాయం చేయాలని డీఆర్‌వోను ఆదేశించారు. మా అమ్మ హత్య జరిగిన తర్వాత మేము అనాథలం అయిపోయామని, మీరే ఆదుకోవాలని కలెక్టర్‌ ఎదుట పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. గురువారం జరిగిన హత్య అనంతరం తలను పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళుతున్న సుబ్బమ్మ వీడియోను జేసీ కలెక్టర్‌కు చూపించారు. ఇలాంటి సంఘటనను నేను తొలిసారిగా చూస్తున్నాను కానీ దీనిని అంత తేలిగ్గా వదలం ఇలంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పిల్లల బంధువులకు నచ్చజెప్పారు. పిల్లల చదువు విషయంలో ఎలాంటి సాయం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని, పిల్లల మేనమామకు కలెక్టర్‌ హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-08-14T04:26:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising