ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములకలచెరువు టు అండమాన్‌

ABN, First Publish Date - 2022-08-11T04:22:07+05:30

ములకలచెరువు టమోటాలు అండమాన్‌ నికోబార్‌ దీవులకు ఎగుమతి అయ్యాయి. అండమాన్‌కు టమోటాలు తరలించేందుకు 600 బాక్సులను తీసుకుని లారీ బుధవారం సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది.

అండమాన్‌కు తరలించేందుకు టమోటాలు ప్యాకింగ్‌ చేస్తున్న కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇక్కడి నుంచి చెన్నైకు... ఓడ ద్వారా అండమాన్‌కు

600 బాక్సులను తీసుకెళ్లిన వ్యాపారస్థులు


ములకలచెరువు, ఆగస్టు 10: ములకలచెరువు టమోటాలు అండమాన్‌ నికోబార్‌ దీవులకు ఎగుమతి అయ్యాయి. అండమాన్‌కు టమోటాలు తరలించేందుకు 600 బాక్సులను తీసుకుని లారీ బుధవారం సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది. చెన్నై నుంచి వ్యాపారస్థులు ములకలచెరువుకు వచ్చి అండమాన్‌కు టమోటాలు తరలించేందుకు తోటలను ఎంపిక చేసుకుంటున్నారు. ములకలచెరువు మాజీ సర్పంచ్‌ రవీంద్రారెడ్డి సాగు చేసిన టమోటా పంటను అండమాన్‌కు తరలించేందుకు వ్యాపారస్థులు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో బుధవారం పచ్చి, దోరగా ఉన్న టమోటాలను కూలీలతో బాక్సులలో ప్యాకింగ్‌ చేయించారు. రైతు వద్ద నుంచి బాక్సు రూ.360తో కొనుగోలు చేశారు. 18 టన్నుల 600 బాక్సులతో లారీ సాయంత్రం తమిళనాడు చెన్నై ఓడరేవుకు బయలుదేరింది. ఈ లారీ అర్ధరాత్రికి చెన్నైకు చేరుకోనుంది. అనంతరం గురువారం ఉదయం టమోటాలను తీసుకుని ఓడ అండమాన్‌ నికోబార్‌ దీవులకు బయలుదేరనుంది. ఈ టమోటాలు ఐదు రోజుల్లోగా అండమాన్‌కు వెళతాయని వ్యాపారస్ధులు తెలిపారు. సాహో రకం టమోటాలు కావడంతో రవాణా చేసేందుకు అనువుగా ఉంటాయని, ఎనిమిది రోజులైనా దెబ్బతినవని వ్యాపారస్థులు చెబుతున్నారు. అండమాన్‌లో 27 కిలోల టమోటా బాక్సు రూ.వెయ్యికి పైగా ఉండవచ్చని స్థానిక రైతులు చెబుతున్నారు. అండమాన్‌లో టమోటాలకు డిమాండ్‌ భారీగా ఉండడంతో వ్యాపారస్థులు ఎగుమతి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని రైతులు అంటున్నారు. 



Updated Date - 2022-08-11T04:22:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising