ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు దశాబ్దాలైనా.. అందని పరిహారం!

ABN, First Publish Date - 2022-04-16T04:54:46+05:30

మూడు దశాబ్దాలు గడుస్తున్నా ముంపు పరిహారం అందలేదని చిన్నపోతుల ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్నపోతుల ప్రాజెకు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ‘చిన్న బోతుల’ నిర్వాసితుల ఆవేదన 

రేపు మాపు అంటున్న అధికారులు

లక్కిరెడ్డిపల్లె, ఏప్రిల్‌ 15: మూడు దశాబ్దాలు గడుస్తున్నా ముంపు పరిహారం అందలేదని చిన్నపోతుల ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పాలెంగొల్లపల్లె చిన్నపోతులపల్లె పైభాగాన  1990లో చిన్నపోతుల ప్రాజెక్టు నిర్మించారు. అందుకోసం 300 ఎకరాలకుపైగా సేకరించారు. ఇందుకు సంబంధించి ఎకరాకు రూ. 30 వేలకుపైగా  పరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ మేరకు 70 శాతం మందికి మాత్రమే పరిహారం అందింది. మిగిలినవారిని రేపు మాపంటూ 30 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిప్పుకున్నారు.  ఈ నేపథ్యంలో 2008లో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ గిరిజాశంకర్‌, ఆర్డీవో భాషా నిర్వాసితులకు ఎకరాకు రూ.60 వేలు చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. అయితే, ఇప్పటిదాకా పరిహారం అందలేదు. నిర్వాసితులందరికీ పరిహారం చెల్లిస్తా మని 4 నెలల క్రితం  గ్రామానికి వచ్చిన రెవెన్యూ అధికారులు హడావుడి చేశారని, ఆ తర్వాత అయిపులేకుండా పోయారని  చిన్నరాయుడు, ఈశ్వరమ్మ, వెంకటరమణ, వెంకట్రమణనాయుడు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్వాసితులకు పరిహారం అందించాలని వారు కోరారు. 

Updated Date - 2022-04-16T04:54:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising