ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి

ABN, First Publish Date - 2022-08-10T05:14:20+05:30

గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారిని అన్ని విధాల ఆదుకోవాలని సంఘం నేతలు డిమాం డ్‌ చేశారు.

మదనపల్లెలో బైక్‌ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజన సమాఖ్య నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 స్వాతంత్య్రం సిద్ధించి  75ఏళ్లైనా మారని అడవి బిడ్డల జీవితాలు 

 ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సంఘ నేతల ఆందోళన

మదనపల్లె అర్బన్‌, ఆగస్టు 9: గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారిని అన్ని విధాల ఆదుకోవాలని సంఘం నేతలు డిమాం డ్‌ చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు కావస్తున్నా అడవి బిడ్డల జీవితాల్లో మార్పు కనిపించడంలేదని వారు ఆందోళన వ్యక్తం చేశా రు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మంగళవారం మదనపల్లెలో ఘనం గా నిర్వహించారు. అంబేడ్కర్‌ సర్కిల్‌లో ఏపీగిరిజన యానాది సేవాసం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీనివాసులు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహనికి పూలమాలవేసి ఆదివాసీలంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యత వర్దిలాలని నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ గిరిజనులకు ఒక ఎమ్మెల్సీ పదవితోపాటు రాజ కీయపదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్రవర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులిశ్రీనివాసులు, రాష్ట్ర కోశాధి కారి టేకుమంద రెడ్డెప్ప, జిల్లా నాయకులు జానం గంగిరెడ్డి, మధు, నరసింహులు, సుధాకర్‌, రెడ్డిబాబు, మహేష్‌, నారాయణ, దాము, రాజశేఖర్‌, భవానీ పాల్గొన్నారు. అలాగే రాష్ట్రగిరిజన సమాఖ్య అధ్యక్షుడు కోనేటి దివాకర్‌ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినో త్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో బౌక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్ర మంలో బాస్‌ నేతలు శ్రీచందు, మోహన, గిరిజనసమాఖ్య నేతలు పీరు సాబ్‌, గంగాధర, నర్సీ, కృష్ణ, శ్రీరాములు, రమణ, రెడ్డెప్ప పాల్గొన్నారు.   

పీలేరులో: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మంగళవారం పీలేరులోని పలు ప్రజా సంఘాలు ఘనంగా నిర్వహించాయి. గిరిజన యానాది సేవా సంఘం, రాష్ట్ర గిరిజన సమాఖ్య, మాలమహానాడు, భారతీయ అంబేడ్కర్‌ సేన, ఎంఆర్‌పీఎస్‌ వంటి ప్రజా సంఘాలు వేడుకల్లో పాల్గొని గిరిజను లకు తమ సంఘీభావం తెలిపాయి. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయా సంఘాల నేతలు పీలేరులోని .అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతం త్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడిచి అమృతోత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ గిరిజను ల జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతు న్న పీలేరు పట్టణానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలోని చింతలబైలు గ్రామంలోని గిరిజనులకు ఆధార్‌ కార్డులు లేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర గిరిజన సమాఖ్య పీలేరు అధ్యక్షుడు కిల్లా విజయ్‌ కుమార్‌, నాయకులు జానం గంగిరెడ్డి, రాయల సుధాకర్‌, తుమ్మల ధరణీకుమార్‌, పూల శ్రీనివాసులు, పీవీరమణ, సాధు, ప్రదీప్‌, మహేశ్‌, సుభాష్‌, మల్లి ఖార్జున, లోక, వెంకటరెడ్డి, నాగేంద్ర పాల్గొన్నారు. 

వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండలం వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ గిరిజన యానాది సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్స వం ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్‌, మండలంలోని చింతపర్తి గ్రామాలలో గల అంబే ఛ్కిర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ అధికారులు గిరిజన యానాదుల గ్రామాలు సందర్శించి వారి అభివృద్ధికి పాటుపడాలన్నారు. క్రార్యక్రమం లో సంఘ చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల గౌరవాధ్యక్షుడు జానం గంగిరెడ్డి, న్యాయ సలహాదారు డాక్టర్‌ రాయల సుధాకర్‌రాయలు, డాక్టర్‌ రాయల సుధాకర్‌రాయలు, చింతపర్తి గౌతం, ఎం.రెడ్డిబాబు, మహేష్‌, జి.నారాయణ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-10T05:14:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising