ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొయ్యండయ్యా...!

ABN, First Publish Date - 2022-05-17T05:14:30+05:30

కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక రిపేరు వస్తుండడంతో ప్రయాణికులు విసుగు చెందుతున్నారు. మార్గ మధ్యలో ఆగిపోవడంతో వేరొక బస్సులో ప్రయాణికులను పంపాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలాంటి సంఘటనే ఒకటి రైల్వేకోడూరు టౌన్‌లో సోమవారం చోటు చేసుకుంది. తిరుపతి- రైల్వేకోడూరు రూటు బస్సు రైల్వేకోడూరు నుంచి ఉదయం బయల్దేరింది.

రైల్వేకోడూరులో బస్సు ఆగిపోవడంతో తోస్తున్న విద్యార్థులు, యువకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రయాణికుల కష్టాలు

రైల్వేకోడూరు, మే 16: కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక రిపేరు వస్తుండడంతో ప్రయాణికులు విసుగు చెందుతున్నారు. మార్గ మధ్యలో ఆగిపోవడంతో వేరొక బస్సులో ప్రయాణికులను పంపాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలాంటి సంఘటనే ఒకటి రైల్వేకోడూరు టౌన్‌లో సోమవారం చోటు చేసుకుంది. తిరుపతి- రైల్వేకోడూరు రూటు బస్సు రైల్వేకోడూరు నుంచి ఉదయం బయల్దేరింది. కాసేపటికే బస్సు ఆగిపోవడంతో చేసేది లేక ప్రయాణికులందరూ దిగి తోయాల్సిన పరిస్థితి వచ్చింది. పట్టణంలో ఇలా జరగడంతో కొద్ది మేరకు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా, రైల్వేకోడూరు ఆర్టీసీ బస్టాండుకు కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు, మైదుకూరు, కర్నూలు, ఆళ్లగడ్డ, హైదరాబాద్‌, తిరుపతి, రాజంపేట, రాపూరు, నెల్లూరు తదితర డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు ప్రతి రోజు వస్తాయి. వీటిల్లో రాజంపేట డిపోకు చెందిన బస్సులు చాలా వరకు కాలం చెల్లాయని ప్రయాణికులు ఆరోపిస్తు న్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకుని కాలం చెల్లిన బస్సులను తీసివేసి కొత్త బస్సులను నడపాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-05-17T05:14:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising