ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే.. మున్సిపల్‌ చైర్మన్‌.. ఎవరి మాటలు నిజం!?

ABN, First Publish Date - 2022-06-26T04:42:33+05:30

మున్సిపల్‌ కమిషనర్‌పై జరిగిన దాడి విషయంలో ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ పరస్పర విరుద్ధంగా వ్యాఖ్యానిస్తుండడంతో ఎవరి మాటలు నమ్మాలో అర్థం కావడం లేదని రాయచోటి మండల మాజీ ఉపాధ్యక్షుడు అనుంపల్లె రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న అనుంపల్లె రాంప్రసాద్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన్‌, జూన్‌ 25: మున్సిపల్‌ కమిషనర్‌పై జరిగిన దాడి విషయంలో ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ పరస్పర విరుద్ధంగా వ్యాఖ్యానిస్తుండడంతో ఎవరి మాటలు నమ్మాలో అర్థం కావడం లేదని   రాయచోటి మండల మాజీ ఉపాధ్యక్షుడు అనుంపల్లె రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే ప్రకటన ఇవ్వగా, మున్సిపల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాషా మాత్రం దాడి జరగలేదని వ్యాఖ్యానించారని, ఇద్దరిలో ఎవరి మాటలు నిజమో వైసీపీ నేతలకే తెలియాలన్నారు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో  రకంగా మాట్లాడడాన్ని బట్టి దాడి వెనుక శ్రీకాంత్‌రెడ్డి హస్తం ఉన్నదన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంద న్నారు.  కౌన్సిలర్‌ మదన్‌మోహన్‌రెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో కలసి తన పబ్బం గడుపుకుంటున్నాడని ఆరోపించారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా తన కుటుంబ సభ్యుల పేరుతో ఎన్ని పథకాలు తీసుకుంటున్నాడనేది గణాంకాలతో సహా నిరూపిస్తామని సవాల్‌ విసిరారు.  ఈ సమావేశంలో పెమ్మాడపల్లె సర్పంచ్‌ పల్లపు సర్పంచ్‌ పల్లపు వాసు, టీడీపీ నేతలు సుబ్బయ్యనాయుడు, రెడ్డెప్ప, హరిఅమర్నాధ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-26T04:42:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising