ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పుదారి పట్టించే విధానాలు మానుకోవాలి

ABN, First Publish Date - 2022-01-23T04:58:46+05:30

పీఆర్సీ అమలు వల్ల ఏ ఉద్యోగికి రావాల్సిన మొత్తం జీతంతో ఏమాత్రం తగ్గుదల ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉద్యోగులతో బాటు ప్రజలను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మీరాజా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా

కడప (ఎడ్యుకేషన్‌), జనవరి 22 : పీఆర్సీ అమలు వల్ల ఏ ఉద్యోగికి రావాల్సిన మొత్తం జీతంతో ఏమాత్రం తగ్గుదల ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉద్యోగులతో బాటు ప్రజలను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా తెలిపారు. యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం సుమారు 36 వేల కోట్ల రూపాయలు తగ్గిపోయిందని, అయినా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు చెల్లించే జీతాల శాతం ఎక్కువని చెప్పడంతో ఏమాత్రం కొత్త విషయాలు లేవని, గతంలో ఉద్యోగ, సంఘాలతో చెప్పిన విషయాన్నే చెప్పారన్నారు. ఈరోజుకి కూడా కాంట్రాక్ట్‌  ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడం గాని, సీపీఎస్‌ రద్దు మీద గాని స్పందించకపోవడం చూస్తే నట్టేట ముంచేందుకేనని విమర్శించారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌, సహాధ్యక్షులు వై.రవికుమార్‌, కోశాధికారి పి.మహే్‌షబాబు, జిల్లా కార్యదర్శులు పి.చంద్రశేఖర్‌, మస్తానయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T04:58:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising