ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెగా లోక్‌అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం

ABN, First Publish Date - 2022-08-14T05:03:01+05:30

రాయచోటిలోని జిల్లా 5వ అదనపు జడ్జి కోర్టులో శనివారం నిర్వహించిన మె గాలోక్‌ అదాలత్‌లో 585 కేసులను పరిష్కరించారు.

నందలూరు: లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్న జడ్జి లత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన్‌, ఆగస్టు13: రాయచోటిలోని జిల్లా 5వ అదనపు జడ్జి కోర్టులో  శనివారం నిర్వహించిన మె గాలోక్‌ అదాలత్‌లో 585 కేసులను పరిష్కరించారు.  ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి ఫాతిమా, అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శారద, కేసుల పరిష్కారం తోపాటు రూ.1 కోటి 20 వేలు జరిమానా విధించా రు.  పోలీసు అధికారులు, న్యాయవాదులు, కక్షిదారు లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 

నందలూరు: నందలూరు జూనియర్‌సివిల్‌ జడ్జి కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్‌అదాలత్‌లో 280 కేసులకు శాశ్వత పరిష్కారం లభించినట్లు జడ్జి కె.లత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సివిల్‌ కేసుల్లో రూ. 8,03,900 , క్రిమినల్‌ కేసుల్లో రూ.13,24,600, చెక్‌బౌన్స్‌ కేసుల్లో రూ.30,00,000 ఫిర్యాదుదారులకు చెల్లించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇతర క్రిమినల్‌ కేసులలో  అపరాధ రుసుం కింద 2,38,470 ప్రభుత్వానికి జమ చేశామన్నారు.  న్యాయవాదులు పాల్గొన్నారు. 

లక్కిరెడ్డిపల్లె: రాజీ మాత్రమే రాజమార్గమని లక్కి రెడ్డిపల్లె సివిల్‌ జడ్జి డాక్టర్‌ శారద తెలిపారు. శని వారం లక్కిరెడ్డిపల్లె సివిల్‌ కోర్టులో లోక్‌అదాలత్‌ నిర్వహించారు. 213 కేసుల పరిష్కారంతో పాటు మొండి బకాయిలు రూ. 72,800 వసూలైనట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. క్షక్షిదారులు లోక్‌అదాలత్‌తో సమస్యలు పరిష్కరించుకోవచ్చునని ఆమె తెలిపారు. భూతగాదాలు చిన్న చిన్న సమస్యలు గ్రామంలోనే పరిష్కరించుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో పీ పీ సుహాసిని, న్యాయవాదులు ఎంఎల్‌ రామచంద్రా రెడ్డి, చెన్నకృష్ణయ్య, రెడ్డెన్న, పోలీసు సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు. 

రైల్వేకోడూరు రూరల్‌: లోక్‌అదాలత్‌లో 92 కేసులు పరిష్కారం అయినట్లు రైల్వేకోడూరు సీఐ విశ్వనాఽథ్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షణికావేశాలకు పోయి ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకుంటున్నారని, దీంతో జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపారు.  ప్రతి ఒక్కరూ ఆవేశాలను పక్కనపెట్టి  ఒక్క నిమిషం ఆలోచిస్తే జీవితాలు బాగుపడతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో కోర్టు కానిస్టేబుల్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-14T05:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising