ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌గాంధీ పాదయాత్రను విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2022-08-12T04:46:56+05:30

అధికార బీజేపీ అవలంభిస్తున్న విభజన వాదాన్ని వ్యతిరేకిస్తూ తమ నేత రాహుల్‌గాంధీ చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేయాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పీలేరులో నినాదాలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి 


పీలేరు, ఆగస్టు 11: అధికార బీజేపీ అవలంభిస్తున్న విభజన వాదాన్ని వ్యతిరేకిస్తూ తమ నేత రాహుల్‌గాంధీ చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేయాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీలేరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ అటు ప్రజలు, ఇటు రాష్ట్రాల మధ్య విభజనవాదాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు ఏర్పడిందన్నారు. దేశ ప్రజల హృదయాల్లో బీజేపీ నాటిన విభజన, విద్వేష భావాలను తొలగించి జాతీయ భావాన్ని జాగృతం చేసేందుకు తమ నేత రాహుల్‌గాంధీ సెప్టెంబరు 7వ తేదీ నుంచి పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 3 వేల కిలోమీటర్లు, 12 రాష్ట్రాల గుండా పాదయాత్ర సాగుతుందన్నారు. అందులో భాగంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దాదాపు 100 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందన్నారు. దేశ ప్రజలు రాహుల్‌గాంధీ పాదయాత్రను విజయవంతం చేసి బీజేపీ పట్ల తమకున్న వ్యతిరేకతను, దేశం పట్ల ఉన్న జాతీయ భావాన్ని చాటాలని కోరారు. కార్యక్రమంలో పీలేరు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ ఆఘామొహియుద్దీన్‌, నాయకులు అత్తార్‌ చాన్‌బాషా, జకీయుద్దీన్‌, సలావుద్దీన్‌, నాగరాజు, మహబూబ్‌బాషా, రహంతుల్లా, అమర్‌, ఉత్తన్న, కళ్యాణ్‌, శివ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T04:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising