ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లంపీ స్కిన్‌ దడ

ABN, First Publish Date - 2022-12-15T23:39:29+05:30

పశు పోషకుల్లో లంపీ స్కిన్‌ దడ పుట్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ వైరస్‌ విస్తరించింది. ఇప్పటికే ఈ వ్యాధిబారిన పడి 48 తెల్ల పశువులు మృతి చెందాయి. దీంతో పశు పోషకులు ఆందోళన చెందుతున్నారు. వైరస్‌ సోకడానికి 2 నుంచి 3 రోజుల ముందు పశువులకు జ్వరం వస్తుంది. అనంతరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెల్ల పశువులపై పంజా

ఇప్పటికే 48 మృతి

రైతుల్లో ఆందోళన

వైరస్‌ కట్టడికి వ్యాక్సినేషన్‌

(కడప - ఆంధ్రజ్యోతి): పశు పోషకుల్లో లంపీ స్కిన్‌ దడ పుట్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ వైరస్‌ విస్తరించింది. ఇప్పటికే ఈ వ్యాధిబారిన పడి 48 తెల్ల పశువులు మృతి చెందాయి. దీంతో పశు పోషకులు ఆందోళన చెందుతున్నారు. వైరస్‌ సోకడానికి 2 నుంచి 3 రోజుల ముందు పశువులకు జ్వరం వస్తుంది. అనంతరం శరీరం అంతటా 2 నుంచి 5 సెంటీమీటర్ల పరిమాణంలో చర్మంపై పొక్కులు, దద్దుర్లు, బొబ్బలు కనిపిస్తున్నాయి. తీవ్ర జ్వరం వచ్చి పశువులు గడ్డి తినడం, పాలివ్వడం మానేస్తున్నాయి. తొలుత ఈ మహమ్మారిని పాకిస్తాన్‌లో గుర్తించారు. అక్కడి నుంచి మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు విస్తరించి తెలంగాణ నుంచి మన రాష్ట్రంలోకి అడుగు పెట్టింది. లంపీ స్కిన్‌ వ్యాధి ఆవులు, ఎద్దుల్లో కనిపిస్తుంది. ఇప్పటికే 48 తెల్ల పశువులు మృతి చెందాయి. సుమారు 2వేల దాకా ఆవులు, ఎద్దులు లంపీ స్కిన్‌ బారిన పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కడప, జమ్మలమడుగు, పులివెందుల డివిజన్లలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పశు సంవర్ధకశాఖ అప్రమత్తమైంది. పశువులన్నింటికీ ముందస్తుగా వ్యాక్సినేషన్‌ వేస్తున్నారు.

రైతుల్లో ఆందోళన

పశు సంవర్ధకశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ఆవులు, ఎద్దులు 43,409 ఉన్నాయి. కడప డివిజనులో 14,278, జమ్మలమడుగులో 18,187, పులివెందులలో 10,944 పశువులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలాచోట్ల కాడెద్దులతోనే వ్యవసాయం చేస్తున్నారు. సొంత పొలంలో వ్యవసాయ పనులతో పాటు మిగతా రైతు పొలాల్లో డబ్బులకు దుక్కిలు దున్నేందుకు రైతులు వెళుతుంటారు. చాలామంది రైతుల వద్ద కాడెద్దులు ఉన్నాయి. అలాగే పాడికోసం కొందరు రైతులు గేదెలతో పాటు ఆవులను పెంచుకుంటున్నారు. బద్వేలు, బి.కోడూరు, కలసపాడు, పోరుమామిళ్ల, మైలవరం, చాపాడు, యర్రగుంట్ల, మైదుకూరు, పెద్దముడియం, రాజుపాలెం, సింహాద్రిపురం, కలసపాడు, లింగాలదిన్నె, ప్రొద్దుటూరుతో పాటు మరికొన్ని చోట్ల లంపీ స్కిన్‌ వ్యాధిన పడి తెల్ల పశువులు మృతి చెందాయి.

ఇలా వ్యాప్తి చెందుతుంది..

లంపీ స్కిన్‌ వ్యాధి సోకిన పశువు నుంచి కీటకాల ద్వారా కానీ, దోమల ద్వారా కానీ క్రిములతో కలుషితమైన గాలి ద్వారా పశువులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా క్యులెక్స్‌ ఎడిస్‌ దోమలు, స్టోమాక్సిస్‌ ఈగలు, పిరుదుల ద్వారా వైరస్‌ సోకుతుంది. వైరస్‌ సోకిన పశువులకు జ్వరం రావడం, కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం, నోటి నుంచి చొంగ కారడం మొదటి లక్షణం. తరువాత చెంప కింద, నోటి చిగురు, ముక్కు మీద కణితులు ఏర్పడతాయి. దీంతోపాటు మెడ, తోలు దగ్గర లింప్‌ గ్రంధులు వాచి పొదుగు, రొమ్ము భాగం, కాలి కీళ్లలోకి నీరు చేరుతుంది. లంపీస్కిన్‌ వైరస్‌ సోకిన ఆవుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. చర్మం పొల్లుగా మారడం, కంటి చూపు మందగిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది.

చికిత్స ఇలా

వ్యాధి వచ్చిన తరువాత ప్రత్యేక మందులు ఏవీ లేవని పశువైద్య అధికారులు చెబుతున్నారు. పెద్దగా ప్రాణనష్టం ఏమీ లేదని బ్యాక్టీరియా వల్ల కణితులు చీము పట్టడం జరుగుతుందని అంటున్నారు. వ్యాధి నివారణకు.. బెల్లం, పసుపు, అలోవేరా గుజ్జు, తులసి ఆకులను ఐదు రోజులు ఉదయం, సాయంత్రం కలిపి తినిపించాలి. పసుపు, తులసి, అలోవెరా గుజ్జు, వేపనూనె కలిపి ఉదయం, సాయంత్రం వేళల్లో రాస్తే మంచి ఫలితాలు వస్తాయని పశు వైద్యాధికారులు అంటున్నారు.

వ్యాక్సినేషన్‌

లంపీ స్కిన్‌ వ్యాధి నుంచి కట్టడి చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టింది. జిల్లాలో మొత్తం పశువులు 43,409 ఉన్నాయి. 84 శాతం వ్యాక్సినేషన్‌ వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో 34,728 ఆవులు, ఎద్దులకు వ్యాక్సినేషన్‌ చేపట్టారు.

Updated Date - 2022-12-15T23:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising