ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.83 కోట్లతో ఎల్‌ఎ్‌సపీ పనులు

ABN, First Publish Date - 2022-06-27T04:46:55+05:30

బద్వేలు ప్రాంత రైతాంగ సాగునీటికి ఆదరవు అయిన లోయర్‌ సగిలేరు ప్రాజెక్టు(ఎల్‌ఎస్‌పీ) సంబంధించి రూ. 83.54 కోట్లతో కాల్వల విస్తరణ, కొత్తగేట్ల నిర్మాణ ప నులు చేపట్టారు.

లెఫ్ట్‌ కెనాల్‌ పనులు జరుగుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

500 క్యూసెక్కుల సామర్థ్యంతో కాల్వల విస్తరణ

బద్వేలు, జూన్‌ 26: బద్వేలు ప్రాంత రైతాంగ సాగునీటికి ఆదరవు అయిన లోయర్‌ సగిలేరు ప్రాజెక్టు(ఎల్‌ఎస్‌పీ) సంబంధించి రూ. 83.54 కోట్లతో కాల్వల విస్తరణ, కొత్తగేట్ల నిర్మాణ ప నులు  చేపట్టారు. పోరుమామిళ్ల సమీప వంకమర్రి వద్ద నల్లమల అడవుల్లో వచ్చే వర్షపునీటి ఆధారంగా ఈ ప్రాజెక్టు నుంచి బద్వేలు పెద్ద చెరువుకు నీరు అందుతుంది. చాలాకాలం కిం దట నిర్మించిన ఈప్రాజెక్టు గేట్లు దెబ్బతిన్నా యి. వరద తాకిడికి కూడా గురైన పరిస్థితుల్లో ఐదు గేట్లను పటిష్టంగా నిర్మించడంతో పాటు ఎడమ కాల్వను విస్తరించే పనులు చేపట్టారు. రూ.3.87కోట్లతో చేపట్టిన గేట్ల నిర్మాణ పనులు రెండు నెలల్లోపు పూర్తి కానున్నాయి.

ఎడమ కాల్వ విస్తరణ పనులు వేగం గా జరుగుతున్నాయి. ఈ కాల్వ ద్వారా ఇప్పటివరకు ప్రవాహ సామర్థ్యం 200 క్యూసెక్కులు మాత్రమే ఉండగా ఇప్పుడు దీనిని  500 క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరిస్తున్నారు. ఈపనులు 79.67 కోట్లతో జరుగుతున్నాయి. ఈ కాల్వ పూర్తి అయితే బద్వేలు పెద్ద చెరువుకు తక్కువ రో జుల్లోనే నీరు నింపే అవకాశం ఉంటుంది. దీంతో బద్వేలు చెరువు ఆయకట్టు రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాజెక్టు పనులు ప్రాధాన్యత క్రమాన్ని బట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు జరుగుతున్నాయి.

Updated Date - 2022-06-27T04:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising