ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం దుకాణాన్ని తరలించాలి

ABN, First Publish Date - 2022-07-08T05:14:05+05:30

పట్టణ సమీపంలోని భువనగిరిపల్లె ముఖద్వారం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని బీజేపీ రాష్ట్ర రాజకీయ సలహామండలి సభ్యుడు, రాజంపేట పార్లమెంట్‌ నాయకుడు సాయిలోకేష్‌ ఆధ్వర్యంలో భువనగిరిపల్లె గ్రామస్తులు కలెక్టర్‌ గిరీషాకు వినతిపత్రం సమర్పించారు.

కలెక్టర్‌ గిరీషాకు వినతిపత్రం సమర్పిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు సాయిలోకేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌కు భువనగిరిపల్లె గ్రామస్థుల ఫిర్యాదు 

రాజంపేట, జూలై 7: పట్టణ సమీపంలోని భువనగిరిపల్లె ముఖద్వారం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని బీజేపీ రాష్ట్ర రాజకీయ సలహామండలి సభ్యుడు, రాజంపేట పార్లమెంట్‌ నాయకుడు సాయిలోకేష్‌ ఆధ్వర్యంలో భువనగిరిపల్లె గ్రామస్తులు కలెక్టర్‌ గిరీషాకు వినతిపత్రం సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా 100 మీటర్ల దూరం లేని ఓ పాఠశాల వెనుక భాగంలో ఈ మద్యం దుకాణం ఉందని, ప్రతి రోజూ తమ గ్రామం నుంచి చిన్నారులు పాఠశాలకు వెళ్లేటప్పుడు మందు బాబులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్‌కు వివరించారు. ఇదిలా ఉండగా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన భువనగిరి లక్ష్మీనృసింహస్వామి గుట్టపైకి వెళ్లాలంటే ఈ మద్యం దుకాణం ద్వారానే వెళ్లాలని, గుడికి వచ్చే భక్తులతో మందుబాబులు చేస్తున్న వికృత చేష్టల వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే మద్యం దుకాణాన్ని తరలించకుంటే గ్రామస్థులమంతా ఏకమై ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సురే్‌షరాజు, భువనగిరిపల్లె గ్రామ వార్డు సభ్యుడు నరేష్‌, కోలాటం హరికృష్ణ, కంబాయిగారి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-08T05:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising