ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ సత్తాను చాటుదాం

ABN, First Publish Date - 2022-06-30T05:09:24+05:30

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సత్తా ఏంటో వైసీపీ నాయకులకు మినీ మహానాడు ద్వారా తెలియజేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీ శ్రేణులకు సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి

గుర్రంకొండ/వాల్మీకిపురం, జూన్‌ 29: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సత్తా ఏంటో వైసీపీ నాయకులకు మినీ మహానాడు ద్వారా తెలియజేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీ శ్రేణులకు సూచించారు. గుర్రంకొండలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీకి ఉన్నారని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరన్నారు. అలాంటి టీడీపీ శ్రేణులు మదనపల్లెలో జరిగే మినీ మహానాడుకు వేలాదిగా హాజరై వైసీపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టించాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు మదనపల్లె మినీ మహానాడు చెంపపెట్టులా ఉండాలని శ్రేణులలో ఉత్సాహాన్ని నింపారు. ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో కార్యక్రమానికి రావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో నాయకులు నాయిని జగదీ్‌షకుమార్‌, ఎం.ఎల్‌.ఎన్‌.మూర్తిరావు, హరిప్రసాద్‌నాయుడు, రెడ్డిప్రసాద్‌నాయుడు, నౌషాద్‌ అహ్మద్‌, మురళి, ఎజాజ్‌ అహ్మద్‌, ఇక్బాల్‌ ఖాసీం, తదితరులు పాల్గొన్నారు.


చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటా..

కష్టకాలంలో రాజకీయంగా ఆదరించిన చంద్రబాబునాయుడుకు జీవితాంతం తాను రుణపడి ఉంటానని నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం వాల్మీకిపురం పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పార్టీలో చేరిన తక్షణం ఆదరించి పదవి ఇవ్వడం, గుర్తింపు ఎన్నటికీ మర్చిపోనన్నారు. జూలై 6వ తేదీ మదనపల్లెలో  జరగనున్న మినీ మహానాడు కార్యక్రమం విజయవంతం చేయడమే ప్రతి కార్యకర్త ధ్యేయంగా కృషి చేయాలన్నారు. పీలేరు నియోజకవర్గం నుంచి పార్టీని గెలిపించి సత్తా చాటాలన్నారు. మూడేళ్లుగా ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులు ఎదుర్కొన్న ప్రతి కార్యకర్తకూ తాను అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కంభం నిరంజన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, రాజంపేట పార్టీ పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రాజేంద్రాచారి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వెంకటరమణ, పీలేరు మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌బాషా, తదితర నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T05:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising