అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం
ABN, First Publish Date - 2022-12-15T23:59:29+05:30
రాష్ట్రంలో దాడు లు, అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దింప ుదామని తంబళ్లపల్లె నియోజక వర్గ టీడీపీ ఇంచార్జ్ శంకర్ యాదవ్ పేర్కొన్నారు.
ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమంలో టీడీపీ ఇనచార్జ్ శంకరయాదవ్
మాజీ ఎమ్యెల్యే, టీడీపీ ఇనచార్జి శంకర్ యాదవ్
బి.కొత్తకోట డిసెంబర్ 15 : రాష్ట్రంలో దాడు లు, అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దింప ుదామని తంబళ్లపల్లె నియోజక వర్గ టీడీపీ ఇంచార్జ్ శంకర్ యాదవ్ పేర్కొన్నారు. బి.కొత్తకోట మండలంలోని గట్టు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అద్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టాని’కి కార్యక్రమం గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గట్టు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, అరాచ కాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో నిత్యావసరాల ధరలు, విద్యుత, ఆర్టీసీ చార్జీలు ఆకాశాన్ని అంటాయని, ధరల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ నారాయణస్వామిరెడ్డి, తెలుగు యువత అద్యక్షుడు ఆంజి, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిఎండి. మస్తాన, జిల్లా ఎగ్జిక్యూటీవ్ మెంబర్ సుకుమార్, షమీవుల్లా, రెడ్డెన్న, భాస్కర్ రెడ్డి, నాగలాంబిక, అనసూయమ్మ, వెంకటనారాయణ, నవీన తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ పాలనలో అభివృద్ధి ఊసేలేదు : టీడీపీ
నిమ్మనపల్లె, డిసెంబరు 15: వైసీపీ పాలన లో రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపిం చలేదని తెలుగుదేశం పార్టీ నాయ కులు ధ్వజమెత్తారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రాని’కి అం టూ కొండయ్యగారిపల్లె పంచాయతి వెంకో జిగారిపల్లె, మిట్టమీదమాలపల్లె, అంబేడ్క ర్ కాలనీల్లో మాజీ జడ్పీటీసీ వసం త ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం చేస్తు న్న అరాచకాలను, అన్యాయాలను వివ రించా రు. గ్రామస్తులు మాట్లాడుతూ గడిచిన మూడన్నర ఏళ్లలో ముఖ్యమంత్రి జగన గ్రామాల్లో రోడ్లు లేవని, మురుగునీటి సమస్యలు తీర్చలేదన్నారు. వలంటీర్లు వారి బంధువులకు మాత్రమే పఽథకాలు వర్తింప జేస్తున్నారని తాము అర్హులమైనా పింఛన ఇవ్వలేదని ఆయా గ్రామాల ప్రజలు టీడీపీ నేతల ఎదుట వారి కష్టాలను ఏకరువు పెట్టారు. కార్యక్రమంలో మునిరత్నం, గురుప్రసాద్, ఆనంద, చినబాబు, శ్రీనివాసులు, రామచంద్ర, గోపి, విజయ్, మల్లికార్జు న, వెంకటరమణ, సూర్యప్రకాష్, మాబులు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
పెద్దమండ్యంలో: వైసీపీ ప్రభుత్వం ప్రజ ల బాధలు తెలుసుకోవడంలేదని మండల టీడీపీ కన్వీనర్ వెంకటరమణ ఎద్దేవ చేశా రు. మండలంలోని వెలిగల్లు, తురకపల్లి గ్రామాలలో గురువారం టీడీపీ ఆధ్వర్యం లో ఇదేం ఖర్మ రాషా్ట్రనికి కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పెట్రోల్, డీజల్, విద్యుత, బస్సు చార్జీల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కాలేషా, శేషాద్రి, సాంబశివ, మోహన, రఫీ, సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:59:32+05:30 IST