టీడీపీని గెలిపించి వైసీసీ ఖర్మను వదిలించుకుందాం
ABN, First Publish Date - 2022-12-16T00:07:02+05:30
రాబోయే ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజారీతో గెలిపించి వైసీపీ ఖర్మను వదిలించుకుందామని ఆ పార్టీ మండల కన్వీనరు కె.విజయభాస్కర్‌రెడ్డి, మైనార్టీ సెల్ కమలాపురం నియోజకవర్గ అధ్యక్షుడు ఖాజాహుసేన పిలుపునిచ్చారు.
చెన్నూరు, డిసెంబరు 15 : రాబోయే ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజారీతో గెలిపించి వైసీపీ ఖర్మను వదిలించుకుందామని ఆ పార్టీ మండల కన్వీనరు కె.విజయభాస్కర్‌రెడ్డి, మైనార్టీ సెల్ కమలాపురం నియోజకవర్గ అధ్యక్షుడు ఖాజాహుసేన పిలుపునిచ్చారు. గురువారం చెన్నూరులోని మైనార్టీ కాలనీలో ఇదేం ఖర్మ మన రాషా్ట్రనికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ ప్రాంత 2, 3, 4 వార్డుల్లో మైనార్టీలకు వైసీపీ పాలనలో జరిగిన నష్టాన్ని వివరించారు. దుల్హన పథకాన్ని అటకెక్కించారని, మైనార్టీలకు అందే అన్ని రకాల పథకాలకు కోత పెట్టారని తెలిపారు. తాము చంద్రబాబు వెంటే నడుస్తామని ప్రజలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ నాయకులు షబ్బీర్ హుసేన, మాజీ కోఆప్షన సభ్యులు గౌస్‌పీర్, మురళీరాజుతో పాటు ఖాజామొద్దీన, మైనార్టీ నేతలు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T00:07:06+05:30 IST