ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడ్డెరల హక్కుల సాధన కోసం ఉద్యమిద్దాం..

ABN, First Publish Date - 2022-09-26T04:43:29+05:30

హక్కుల సాధనకు ఉద్యమిస్తామని ఏపీ వడ్డెర విద్యావంతుల వేదిక తీర్మానించింది.

మాట్లాడుతున్న వడ్డెర విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకుడు రమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచోటిటౌన్‌, సెప్టెంబరు 25:  హక్కుల సాధనకు ఉద్యమిస్తామని ఏపీ వడ్డెర విద్యావంతుల వేదిక  తీర్మానించింది.  మదనపల్లె రోడ్డులోని ఓ ప్రైవేటు స్కూల్‌ ఆవరణలో ఆదివారం రాష్ట్ర వడ్డెర విద్యావంతుల వేదిక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిఽథిగా హాజరైన వడ్డెర విద్యార్థుల నేత దేరంగుల రమణ మాట్లాడుతూ వడ్డెరలు ప్రతి రంగంలోనూ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారన్నారు.  చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో హక్కులను కోల్పోతున్నారన్నారు. అనంతరం డాక్టర్‌ లక్ష్మిప్రసాద్‌, అడ్వకేట్‌ టీ. ఈశ్వర్‌, సర్పంచ్‌ వాసు మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల పైగా వడ్డెరల జనాభా ఉన్నా ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ వడ్డెర విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ జీవానందం మాట్లాడుతూ వడ్డెరల హక్కుల సాధనకు గ్రామ స్థాయి నుంచి ఉద్యమిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వివిధ కమిటీలను ఎన్నుకున్నారు. అన్నమయ్య జిల్లా కమిటీ అధ్యక్షుడుగా రౌతు చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శిగా మారుతీశంకర్‌, ఉపాధ్యక్షులుగా కుంచపు రెడ్డెయ్య, చల్లా రెడ్డెయ్య, బత్తల వెంకట్రమణ, శ్రీకాంత్‌, బండల శ్రీను, రఘునాధ్‌, సుబ్బరాయుడు, మల్లేష్‌, రామారావు, సహాయ కార్యదర్శిగా దేవరాజ్‌తో పాటు 29 మందిని జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. వడ్డెర విద్యావంతుల వేదిక రాయచోటి మండల అధ్యక్షుడిగా న్యాయవాది దేరంగుల నాగమణి, ప్రధాన కార్యదర్శిగా కోటకొండ రవిబాబు, ఉపాధ్యక్షులుగా చెన్నకేశవులు, సహాయ కార్యదర్శిగా దేవ రాజ్‌, కార్యదర్శిగా విజయ్‌కుమార్‌, నాగేంద్ర, దేవరాజ్‌తో పాటు 20 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఉద్యోగుల విభాగ కన్వీనర్‌గా మల్లేష్‌, న్యాయవాదుల విభాగం కన్వీనర్‌గా గంపా సుబ్బరాయుడు, విద్యార్థి విభాగం కన్వీనర్‌గా కోటేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా దేరంగుల రమణ, నాగేశ్వరరావు, జయరాం, సర్పంచ్‌ వాసు, న్యాయవాది ఈశ్వర్‌లను ఎన్నుకున్నారు. 

Updated Date - 2022-09-26T04:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising